స్వప్నాన్ని నిజం చేసిన గులాబీ..! పద్దెనిమిదో వసంతంలోకి టీఆర్ఎస్..!

తెలంగాణ రాష్ట్ర సమితి… తెలుగు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన పార్టీ. 18 ఏళ్ల క్రితం జ‌లదృశ్యంలో పుట్టిన పార్టీ టిఆర్ఎస్….అంచెలంచెలుగా ఎదిగి.. నేడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగింది. అనేక మంది మేధావులు….ఉద్యమకారుల‌తో ఆనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర స‌మితిని ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాల‌నే సింగిల్ ఎంజెండాతో టీఆర్ఎస్ ఏర్పాటయింది. రాష్ట్ర సాధ‌నే ధ్యేయంగా ప‌ధ్నాలుగేళ్లు అలుపెరుగెని పోరాటం చేసింది. 1969 త‌ర్వాత మ‌రోసారి ఉద్యమం ఉర‌కెలెత్తిందంటే అది కెసీఆర్ వ‌ల్లనే. ఆ ఉరకలెత్తిన ఉద్యమ ఉత్సాహం వల్లే తెలంగాణ సాధ్యమయింది.

పిడికెడు మందితో ప్రారంభం…! నేడు తెలంగాణ సమస్తం..!

ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించిన టిఆర్ఎస్….రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నిన‌దించిన పార్టీ…. గ‌మ్యాన్ని ముద్దాడేందుకు అలుపెరుగని పోరాటం చేసిన పార్టీ. పిడికెడు మందితో 2001లో పురుడు పోసుకున్న టిఆర్ఎస్…. స్వరాష్ట్రంలో త‌న‌దైన ముద్ర వేసింది. ఉద్యమ ప్రస్థానంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టిఆర్ఎస్…. రెండు సార్లు అధికార ప‌గ్గాలు చేప‌ట్టి ముందుకెళుతోంది. 2009 ఎన్నికల తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పార్టీకి… కేసీఆర్ నిరాహారదీక్షతో ప్రాణం పోశారు. చ‌రిత్రలో కేసీఆర్ నిరాహ‌ర‌దీక్ష మైలురాయిగా నిలిచింది. న‌వంబ‌ర్ 9, 2009 రోజు తెలంగాణ వ‌చ్చుడో.. కేసీఆర్ స‌చ్చుడో అనే నినాదంతో కెసీఆర్ ఆమరణ దీక్ష కు దిగారు. దీంతో తెలంగాణ ఉద్యమం మ‌ళ్ళీ రాజుకుంది. ఇది టీఆర్ఎస్ కు బాగా క‌లిసొచ్చింది. అప్పటి వ‌ర‌కు రాజ‌కీయాల కోస‌మే టీఆర్ఎస్ పార్టీ పెట్టారన్న ఆరోప‌ణ‌ల‌కు కెసీఆర్ దీక్షతో చెక్ పెట్టారు. ఆ దీక్షతోనే కెసీఆర్, పార్టీకి ప్రజ‌ల్లో మ‌ద్దతు పెరిగింది. ఇదే ఊపుతో రాష్ట్రంలో ప్రజానీకాన్ని ఏకం చేసి బ‌హిరంగ‌స‌భ‌లు, ర్యాలీలు, సమ్మె లు , ధర్నాలతో హోరెత్తించారు కెసీఆర్.

తెలంగాణ ఇంటి పార్టీగా మారిన టీఆర్ఎస్..!

ఎన్నో ఏళ్ల ప్రజ‌ల ఆకాంక్ష నెర‌వేర్చడంలో కేసీఆర్ విజయం సాధించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన 2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ ప్రజ‌లు టిఆర్ఎస్ కే ప‌ట్టం క‌ట్టారు…అ ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ 63 సీట్లు గెలిచి తొలి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కెసీఆర్ అధికార ప‌గ్గాలు చేప‌ట్టారు. ఇక అప్పటి నుంచి తెలంగాణ ఆభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాల‌పైనే ప్రత్యేక దృస్టి సారించారు అ పార్టి అధినేత కేసిఆర్. తొలి సారి 63స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న టిఆర్ఎస్…..పాల‌నా కాలం పూర్తవ్వక‌ముందే ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లింది… ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసిన‌రోజే…. 105 మంది అభ్యర్ధుల‌ను ప్రక‌టించి ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించారు. ఎన్నిక‌ల్లో 88 స్థానాల‌తో ఘ‌న విజ‌యం సాధించిన టిఆర్ఎస్ రెండో సారి అధికార ప‌గ్గాలు చేప‌ట్టింది.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ..!

టిఆర్ఎస్ సాధించిన భారీ విజ‌యానికి అటు ప్రతిప‌క్ష పార్టీల ఎమ్మెల్యేల‌తో పాటు ముఖ్యనేత‌లు కూడా గులాబీ గూటికి చేరారు. ఇక అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత వ‌చ్చిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లోనూ టిఆర్ఎస్ స‌త్తా చాటింది. అదే ఉపుతో పార్లమెంట్ ఎన్నిక‌ల్లో సారు కారు ప‌ద‌హ‌రు స‌ర్కారు అనే నినాదంతో ముందుకెళ్లింది. ఈ ఎన్నిక‌ల్లో 16 సీట్లు గెలిచి జాతీయ రాజ‌కీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాల‌న్న ల‌క్ష్యంతో ముందుకెళుతున్నారు కెసీఆర్. ఈ ఏడాది టీఆర్ఎస్‌కు మరింత కలసి వస్తుందని.. తెలంగాణ పేరు ప్రఖ్యాతలు దేశం మొత్తం వ్యాపిస్తాయని.. టీఆర్ఎస్ నేతలు నమ్మకంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close