బెట్టింగ్ మార్కెట్‌లో కరెక్షన్..! ఇప్పుడు ఎవరి వైపు అంటే..?

ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన తర్వాతి రోజు నుంచి ఏపీలో బెట్టింగులు ఊపందుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ పెద్ద ఎత్తున పందేలు జరిగాయి. వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడా.. మధ్యవర్తుల వద్దకు చేరాయి. అయితే.. మెల్లగా.. రోజులు గడిచే కొద్దీ… పరిస్థితి మారుతోంది. వైసీపీ తరపున బెట్టింగులు కాసిన వాళ్లంతా చల్లబడిపోయారు. ఇప్పుడు తాజాగా, రివర్స్ బెట్టింగ్ ప్రారంభమైంది. ఇందులో తెలుగుదేశం పార్టీకి 90 నుంచి 95 సీట్లు వస్తాయని, చంద్రబాబు మళ్లీ సియం అవుతారని, గతంలో వైసిపి తరుపున పందేలు కాసినవారే తిరిగి పందేలు కాస్తున్నారు. దీనికి కారణం.. తమ అంచనాలకు భిన్నంగా ఎటువంటి పరిణామం జరిగినా..చేతిలో డబ్బులు పోకుండా బ్యాలెన్స్ అవుతామని రివర్స్ బెట్టింగ్ లు ప్రారంభించారు. వారం రోజుల నుంచి బెట్టింగ్ ల వ్యవహారం తగ్గిపోయింది.

క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలియడం, నిజాలు నిదానంగా బయటికి రావడం, మహిళలు అర్దరాత్రి వరకు పోలింగ్ బూత్ ల వద్ద వేచిచూడటం, పెన్షనర్ల ఓటు టిడిపి వైపు మొగ్గిందని, ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేలు బయటపెట్టడం, గ్రామాలలో సైతం ఈ సారి పోలింగ్ సరళి మారిందని వచ్చిన వార్తలతో అందరికీ నిజాలు నిదానంగా తెలిశాయి. దీంతో బెట్టింగ్ లు పెట్టిన వారంతా చేతిలో డబ్బులు వదులుకోకుండా రివర్స్ బెట్టింగ్ ను ప్రారంభించారు. ఒక్క సీటుతోనైనా టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కొంతమంది, జనసేన మద్దతుతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని మరికొంతమంది బెట్టింగ్ లు ప్రారంభించారు. వీరంతా గతంలో వైసిపి తరుపున బెట్టింగ్ లు వేసిన వారేనని పలువురు చెబుతున్నారు. విజయవాడ కేంద్రంగా ఈ బెట్టింగ్ లు ఎక్కువగా జరుగుతున్నాయి.

వైసిపి నేతలు గతంలో తమ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ లు వేశారని, ఇప్పుడు తెలుగుదేవం పార్టీ గెలుస్తుందని ఆ పార్టీకి చెందిన నేతలే తెలుసుకుని బెట్టింగ్ లు కాసిన వారందరినీ రివర్స్ బెట్టింగ్ లు వేయాలని కోరారని టీడీపీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో ఈ రివర్స్ బెట్టింగ్ ల గోల ఇప్పుడు తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం నూటికి వేయి శాతం గెలుస్తుందని చెప్పడం, కౌంటింగ్ కు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించడం, నియోజకవర్గాల వారీ సమీక్షలు ప్రారంభించడంతో .. చంద్రబాబు.. ఈవీఎంలపై పోరాటంతో తెచ్చి పెట్టిన నిరుత్సాహం.. దూరం అయిన పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

లోక్ సభ ఎన్నికలు : తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లను సాధిస్తుంది..?

లోక్ సభ సీట్లపై ఎవరి లెక్కలు వారివే. 14సీట్లు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే,తాము డబుల్ డిజిట్ స్థానాలను దక్కిచుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close