మహేష్ బాబు మారాలి!!

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కు నిర్మాతల వత్తిడి సహజంగానే ఎక్కువ వుంటుంది. మొహమాటాలు కూడా ఎక్కువే వుంటుంది. అయితే వాల్యూ వుంది, మార్కెట్ వుంది, దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టేద్దాం, డబ్బులు చేసేసుకుందాం అనే ధోరణి మంచిది కాదు. మహేష్ బాబు అసలు డబ్బుల సమస్య ఏమిటి? కృష్ణగారి అబ్బాయిగా గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు.

అతని తోటి నటుల్లో ఒక్క ఎన్టీఆర్ తప్ప మిగిలిన వారు దాదాపు అందరూ అదే స్టేటస్ వున్నవారు. రామ్ చరణ్, బన్నీ, నాగ్ చైతన్య, రానా, ఇలా చాలా జాబితా వుంది. అందరూ వేల కోట్ల ఆస్తిపరులే. కానీ వీళ్లంతా ఎక్కడా మరిన్ని డబ్బులు సంపాదించడానికి వెంపర్లాడినట్లు కనిపించదు. నిదానంగా వన్ బై వన్ సినిమా చేస్తూ వెళ్తున్నారు. బన్నీ అయితే రూపాయి అడ్వాన్స్ ఎవ్వరి దగ్గరా తీసుకోడు. కానీ మహేష్ బాబు అలా కాదు. ఎడా పెడా అడ్వాన్స్ లు లాగేసారు. ఏనాటి అడ్వాన్స్ దానయ్యది? మొన్నటికి మొన్న సినిమా చేసాడు. కేఎల్ నారాయణ అడ్వాన్స్ ఏనాటిది? ఇంకా సినిమా చేయలేదు. హారిక హాసిని అడ్వాన్స్, ఇంక వేచి చూడలేక వెనక్కు తీసుకుంది. అశ్వనీదత్ వడ్డీకి అప్పు తెచ్చి, నాలుగున్నర కోట్లు ఇచ్చి ఎన్నాళ్లయింది? ఇప్పుడు సినిమా చేసారు. ఆ అప్పుకు అయిన వడ్డీ కూడా కొట్లలోనే.

ఒక పక్క ప్రకటనలు, మరో పక్క వ్యాపారాలు, అన్నీ చేసుకోవచ్చు. సినిమా రెమ్యూనిరేషన్ తన ఇష్టానికి పెంచుకోవచ్చు. కానీ తనే బతకాలి అనుకోవడం తప్పు. నిర్మాత కూడా బతకాలి కదా? ఏళ్ల కిందట నాలుగున్నర కోట్లు ఇచ్చి, మరో అన్ని కోట్లు వడ్డీ కట్టిన నిర్మాత బతకాలంటే, అతనికి సోలో సినిమా చేయాలి.

బ్రహ్మోత్సవం డిజాస్టర్ తరువాత మహేష్ తాలూకా బాజా భజంత్రీల బృందం ఏమని వాయించింది. అయిదు కోట్లు వెనక్కు ఇచ్చేసాడోచ్ అనే కదా? ఎప్పుడు ఇచ్చాడు? ఎంత ఇచ్చాడు? కొన్ని నెలల క్రితం. అది కూడా జస్ట్ రెండున్నర కోట్లు. సరే, మరి ఆ నిర్మాతకు చేస్తానన్న సినిమా ఏదీ? అగ్రిమెంట్ ప్రకారం చేయాల్సిన మరో సినిమా ఏదీ?

స్పైడర్ సినిమా ఇంకా బాగా రావాలి, ఇంకా బాగారావాలి. మార్కెట్ బాగా అవుతోంది. లాభం బాగా మిగులుతోంది అని చెప్పి, విచ్చలవిడిగా ఖర్చు చేయించారు. సినిమా డిజాస్టర్. నిర్మాతలు కుదేలు. కానీ వారికి మరో సినిమా చేస్తానన్న హామీ ఎప్పుడ నెరవేరుతుంది?

ఎన్టీఆర్ కు కేరవాన్ వుంది. కానీ డీజిల్ ఖర్చులు మాత్రమే తీసుకుంటాడు. మహేష్ బాబు తన కేరవాన్ కు అద్దె కూడా తీసుకుంటాడని ఇండస్ట్రీ టాక్. ఎందుకింతలా? అభిమానులు నమ్మకపోవచ్చు. కానీ ఇండస్ట్రీ జనాలకు వాస్తవం తెలుసుకదా? మహేష్ వెనకాల అతని వ్యవహారాల గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసుకోవాలి కదా?

పాతిక సినిమాలు చేస్తే, పదే హిట్ లు అన్నది ట్రాక్ రికార్డు. అభిమానులు ఇంకో రకంగా సంబరపడొచ్చు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా మా హీరో మార్కెట్ పెరుగుతూనే వుంటుంది అని. ఫ్లాపులు వచ్చినపుడే నా మార్కెట్ పెరిగింది అని మహేష్ బాబు కూడా గతంలో అన్నారు. కానీ ఆ ఫ్లాపులు తీసిన నిర్మాతల పరిస్థితి ఏమిటి? అన్నది కూడా ఆలోచించాలి కదా?

ముగ్గురు నిర్మాతలకు కలిపి మహర్షి సినిమా చేసారు. అన్నీ డబుల్ డబుల్ ఖర్చులు. విదేశాల్లొ షూటింగ్ చేసి, మళ్లీ ఇండియాకు వచ్చి ప్యాచ్ వర్క్ పేరిట, హెలికాప్టర్ వాడి మళ్లీ షూటింగ్. ఆర్ఎఫ్సీ లో సెట్. కాదు అని చెప్పి మళ్లీ అన్నపూర్ణలో సెట్. టాలీవుడ్ లో సాధ్యం కాదు కానీ, ఖర్చు వివరాలు బయటకు వస్తే, ఎంత వేస్టేజ్ జరిగిందో బయటకు వస్తుంది.

ఆఖరికి ఇప్పుడు ఏం జరిగింది? 150 కోట్ల సినిమా 140 కోట్ల మార్కెట్. పది కోట్లు విడుదలకు ముందే నష్టం అని గుసగుసలు. ఏడాది కష్టపడి, టెన్షన్ పడి, వడ్డీలు కట్టి, నిద్రలేని రాత్రుళ్లు గడిపి నిర్మాత సినిమా తీస్తే మిగిలేది ఇది. రేపు సినిమా హిట్ అయితే ఓకె. కానీ పొరపాటునో, గ్రహపాటునో మరో సైనికుడు, మరో ఆగడు, మరో బ్రహ్మోత్సవం, మరో స్పైడర్ అయితే.. నిర్మాతల ఫిల్ట్ పట్టుకుంటారు బయ్యర్లు.

మహేష్ మారాలి. నిర్మాతల క్షేమం కూడా ఆలోచించాలి. అడ్వాన్స్ లు తీసుకునే వ్యవహారానికి, అడ్వాన్స్ లు తన దగ్గర మురగబెట్టుకునే విధానానికి స్వస్తి పలకాలి. లేదూ అంటే మహేష్ సూపర్ స్టార్ కావచ్చు. మంచి నటుడు కావచ్చు. కానీ మంచి మనసున్నవాడు అనిపించుకోవడం కష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close