తానా మహాసభల ప్రచారం సక్సెస్‌…

వాషింగ్టన్‌డీసీలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) జూలై 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్న 22వ మహాసభలకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. ఈ మహాసభల్లో అందరినీ భాగస్వాములను చేసేందుకు, అలాగే అందరినీప్రత్యేకంగా ఆహ్వానించేందుకు వీలుగా వివిధ కార్యక్రమాలను తానా కాన్ఫరెన్స్‌ నాయకత్వం చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు, వివిధ రకాల పోటీలను నిర్వహించడం ద్వారా అమెరికాలోని తెలుగుకమ్యూనిటీని ఇందులో భాగస్వాములు అయ్యేలా చూస్తోంది. ధీంతానా, వాలీబాల్‌, క్రికెట్‌ వంటి ఆటల పోటీలను నిర్వహించడం ద్వారా ఎంతోమందిని కాన్ఫరెన్స్‌ నిర్వహణలో భాగస్వాములయ్యేలా చేస్తోంది.

ధీంతానా (North American Telugu Community) పోటీల ద్వారా ఆటపాటల ప్రతిభను వెలికితీస్తోంది. తానా-క్యూరీ సంస్థతో కలిసి చిన్నారులకు నిర్వహిస్తున్న సైన్స్‌, మ్యాథ్స్‌, స్పెల్‌బీ పోటీలను నిర్వహించి వారి ప్రతిభకు పదునుపెడుతోంది.పాఠశాలతో కలిసి తెలుగు పోటీలను నిర్వహించి తెలుగు భాషలో వారి పటిమను వెలికితీస్తోంది. దీంతోపాటు పలు కార్యక్రమాలను కూడా అందరికీ ఉపయోగపడేలా కాన్ఫరెన్స్‌లో ఏర్పాటు చేసింది.

ప్రతి కాన్ఫరెన్స్‌ నిర్వహణకు ముందు తానా నాయకులు, కాన్ఫరెన్స్‌ నాయకులు వివిధ నగరాల్లో పర్యటించి కాన్ఫరెన్స్‌ నిర్వహణ వివరాలను, ఏర్పాట్లను కమ్యూనిటీకి తెలియజేయడం పరిపాటి. దాంతోపాటు కాన్ఫరెన్స్‌ నిర్వహణకుఅవసరమయ్యే నిధులను కూడా విరాళాలుగా సేకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయంలో భాగంగానే తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, కాన్ఫరెన్స్‌ నాయకులు నరేన్‌ కొడాలి, మూల్పూరి వెంకట్రావు, ఫండ్‌రైజింగ్‌ చైర్మన్‌ రవిమందలపు వివిధ నగరాల్లో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ నగరాల్లో ప్రచారాన్ని తానా కాన్ఫరెన్స్‌ నాయకత్వం చేపట్టింది.

తానా పెద్దఎత్తున నిర్వహిస్తున్న 22వ మహాసభల (TANA Conference) నిర్వహణకోసం ఎంతోమంది తానా నాయకులు, సభ్యులు,  అభిమానులు, తెలుగు ప్రముఖులు తమవంతుగా విరాళాలను ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రకటించి తానాకుతమవంతు తోడ్పాటును అందిస్తున్నారు. ఇప్పటికే వివిధ చోట్ల నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఎంతోమంది తమ విరాళాన్ని ప్రకటించి తానా మహాసభలను ఘనంగా నిర్వహించాల్సిందిగా నాయకత్వాన్ని ప్రోత్సహించారు. ఇప్పటికా తానాకాన్ఫరెన్స్‌ నాయకత్వం వివిధ నగరాల్లో ప్రచార కార్యక్రమాలను చేసింది. మరికొన్ని చోట్ల కూడా చేస్తోంది. దాదాపు అన్నీ నగరాల్లోని తెలుగు ప్రముఖులను, తానా నాయకులను, అభిమానులను స్వయంగా కలుసుకుని ఆహ్వానించాలనిఅధ్యక్షుడు సతీష్‌వేమన సారధ్యంలోని కాన్ఫరెన్స్‌ బృందం భావిస్తోంది.

న్యూజెర్సి, అస్టిన్‌, హ్యూస్టన్‌, డల్లాస్‌, డిట్రాయిట్‌, కొలంబస్‌, మేరీలాండ్‌, ఫిలడెల్ఫియా ఇతర నగరాల్లో ఇప్పటికే కాన్ఫరెన్స్‌ నాయకత్వం ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలను నిర్వహించింది (TANA conference website).

న్యూజెర్సిలో జరిగిన ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్‌ వేమన పాల్గొని ప్రసంగించారు. వాషింగ్టన్‌ డీసీలో నిర్వహిస్తున్న మహాసభల ఏర్పాట్లు, నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలను అందరికీ తెలియజేశారు.   అస్టిన్‌లోజరిగిన తానా మహాసభల ప్రచార కార్యక్రమం జోరుగా సాగింది. ఇందులో భాగంగా అస్టిన్‌ తానా ప్రతినిధులతో అధ్యక్షుడు సతీష్‌ వేమన సమావేశమయ్యారు. మహాసభల విజయవంతానికి అస్టిన్‌లోని తానా నాయకులు చేస్తున్న కృషినిప్రశంసించారు. అస్టిన్‌ నుంచి పెద్దసంఖ్యలో తానా మహాసభలకు అందరూ తరలిరావాలని ఆయన కోరారు. కాగా తానా మహాసభల నిర్వహణకోసం అస్టిన్‌ తానా విభాగం ఇప్పటికే నిధులను సేకరించి తానా నాయకత్వానికి అందించింది.

హ్యూస్టన్‌లో తానా మహాసభల ప్రచార కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు సతీష్‌ వేమనతోపాటు కాన్ఫరెన్స్‌ చైర్‌ నరేన్‌ కొడాలి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తానా అభిమానులు,నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో భేటీ అయిన సతీష్‌ వేమన వాషింగ్టన్‌ డీసిలో జరిగే తానా మహాసభలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు. టెక్సాస్‌ ప్రవాసులు పెద్ద సంఖ్యలోతరలివస్తారని ఆశిస్తున్నట్లుచెప్పారు. తానా మహాసభల ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలను సతీష్‌ వేమన అందరికీ తెలియజేశారు.

డల్లాస్‌లో కూడా ప్రచారకార్యక్రమం వైభవంగా జరిగింది. అధ్యక్షుడు సతీష్‌ వేమన, కాన్ఫరెన్స్‌ చైర్‌ నరేన్‌ కొడాలి ఈ కార్యక్రమానికి వచ్చారు. దశాబ్దాలుగా తెలుగు భాష, సంస్కృతికి చేస్తున్న సేవలను తెలుపుతూ, వాషింగ్టన్‌ డీసిలో జరిగే తానామహాసభలు చరిత్ర సృష్టించడం ఖాయమని చెప్పారు.

మేరీలాండ్‌లో జరిగిన తానా ప్రచార కార్యక్రమం బాగా జరిగింది. తానా పుట్టిన ప్రాంతంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో మేరీలాండ్‌ తెలుగుసంఘం(టామ్‌), వారథి, జిడబ్ల్యుటిసిఎస్‌ సంఘాల నాయకులు, అభిమానులు, తానా అభిమానులుపెద్దఎత్తున ఈ ప్రచార కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేశారు.

న్యూయార్క్‌, న్యూజెర్సి రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో కూడా తానా ప్రచార కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది తానా నాయకులు, స్థానిక తెలుగు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఫిలడెల్ఫియాలో జరిగిన తానా ప్రచార కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరై తానా కాన్ఫరెన్స్‌ నిర్వహణలో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చారు.

ఇలా వివిధ నగరాల్లో ప్రచార కార్యక్రమాలతో ముందుకెళుతున్న సతీష్‌ వేమన సారధ్యంలోని కాన్ఫరెన్స్‌ బృందం మరిన్ని నగరాల్లో కూడా ప్రచార కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోంది.

తానా మహాసభల్లో ఏర్పాటు చేస్తున్న ఇతర కార్యక్రమాలు, పోటీలు, ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న అతిధులు, ఇతర వివరాలకోసం సందర్శించండి: www.tana2019.org.

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close