ములాయం, అఖిలేష్‌కు సీబీఐ క్లీన్ చిట్..! వాటే టైమింగ్..?

ఉత్తరప్రదేశ్ రాజకీయాలను తన దారికి తెచ్చుకోడానికి మోడీ మళ్లీ సీబీఐని ప్రయోగించారు. ఈ సారి కేసులు పెట్టలేదు. క్లీన్ చిట్ ఇప్పించారు. ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌లకు క్లీన్ చిట్ ఇప్పించారు. ఇది ఓ వింతైన పరిణామం. ఇప్పటి వరకూ.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన వారిపై కేసులు పెట్టడమే తప్ప తీసేసిన దాఖలాలు లేవు. 30, 40 కిందట ఉన్న కేసులు కూడా బయటకు తీసి.. ఇబ్బంది పెడుతున్నారు. అలాంటిది.. ఇప్పుడు.. అఖిలేష్ ములాయంల కేసులపై సాక్ష్యాలు లేవనడం.. అసందర్భమే.

సీబీఐని ఇప్పటికీ అదే పనిగా వాడేస్తున్న మోడీ, షా…?

ఎగ్జిట్ పోల్స్ పై బీజేపీ అగ్రనేతలకే నమ్మకం కలగడం లేదు. ముఖ్యంగా యూపీ విషంయలో మోడీ, షా ఆందోళన చెందుతున్నారు. ఎటుపోయి ఎటు వచ్చినా ఉత్తర ప్రదేశ్ సీట్లు కాపాడు కోవాలి. అఖిలేష్ , మాయావతి ప్రతిపక్ష గూటికి పోకుండా చూసుకోవాలి . ఇదే మోఢీ , అమిత్ షా వ్యూహంగా ఉంది. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడానికి మోడీ ఎన్నోరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను దెబ్బ తీయడానికి మాయావతిని ఉపయోగించుకున్న మోదీ … ఇప్పుడు ప్రతిపక్షాలకు అధికారం దక్కకుండా మాయావతి , అఖిలేష్ యాదవ్ లను ఉపయోగించుకుంటున్నారు. సిబిఐ నిర్ణయం వెలువడడానికి ముందు రోజు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ , రాహుల్ గాంధీలను కలవాల్సి ఉంది . అంతకు ముందు చంద్రబాబు నాయుడు లక్నో వెళ్లి మాయావతి , అఖిలేష్ యాదవ్ ను కలిశారు . మాట్లాడారు . దానికి స్పందనగానే మాయావతి ఢిల్లీ ప్రయాణం ఖరారు అయ్యింది.

మాయావతి ఢిల్లీ టూర్ ఎందుకు రద్దు అయింది..?

కేంద్రం లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి . సోమవారం మాయావతి ఢిల్లీ బయలుదేరి వెళ్లాల్సి ఉంది. సరిగ్గా ఆమె ప్రయాణానికి కొద్దీ గంటల ముందు అఖిలేష్ యాదవ్ మాయావతి ఇంటికి వచ్చారు . సమావేశం ముగిసిన కాసేపటికి బీఎస్పీ మాయావతి ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నారని ప్రకటించింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది . ఆనాడు బీజేపీకి పూర్తి మెజారిటీ రావడానికి ఈ సీట్లు కీలకం. హిందీ రాష్ట్రాల్లో ఎక్కడ కాంగ్రెస్ తో బీఎస్పీ పొత్తులేకుండా కూడా మరో వ్యూహ రచన జరిగింది . ఈ రెండు వ్యూహాల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధాన పాత్ర పోషించారు .

కేసుల భయంతో వారు విపక్షాల్లో కలవరా…?

కేంద్రం లో మోదీ సర్కారు ఏర్పడిన తరవాత , యూపీలో యోగి ప్రభుత్వం ఏర్పాటు తరవాత మాయావతి పై పాత కేసులు తిరగదోడారు . కొత్త కేసులు కూడా పెట్టారు . అందులో మూడు కేసులు ప్రధానమైనవి . 2010లో అక్రమాలంటూ.. ఈ ఏడాది ఫిబ్రవరి 21 న సీబీఐ ఓ కేసు నమోదు చేసింది. రెండోది .. యూపీలో షుగర్ ఫ్యాక్టరీల అమ్మకాల కుంభకోణం . ఏప్రిల్ లో దీనిపై సిబిఐ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది . మూడోది తాజ్ హెరిటేజ్ కారిడార్ కేసు . ఈ కేసులన్నీ మాయావతికి ఇబ్బందికరంగా మారాయి. దాంతో బీజేపీ చెప్పినట్లు చేయాల్సి వస్తోందన్న అభిప్రాయాలున్నాయి. ఓ వైపు మాయావతిని గుప్పిట్లో పెట్టుకున్నారు.. మరో వైపు అఖిలేష్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇలా.. ఇద్దరూ తమ వైపు రావాలన్నట్లుగా.. బీజేపీ ప్లాన్ చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close