ఔను..! కౌంటింగ్ తర్వాతా రీ పోలింగ్..!

“ఎన్నికల సంఘం తీరు చూస్తూంటే.. కౌంటింగ్ తర్వాత కూడా రీపోలింగ్ చేస్తారేమో..” ఇది టీడీపీ అధినేత చంద్రబాబు.. చంద్రగిరిలో రీపోలింగ్‌కు ఆదేశిస్తూ… ఈసీ తీసుకున్న నిర్ణయంపై రాసిన ఘాటు లేఖలో వాక్యం. ఇదే నిజమయ్యే పరిస్థితి ఉందని.. సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి … గోపాలకృష్ణ ద్వివేదీ మాటలను బట్టి స్పష్టమవుతోంది. కౌంటింగ్ తర్వాత కూడా రీపోలింగ్ కు అవకాశం ఉందని… ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే.. అందుకు కొన్ని షరతులు ఉన్నాయంటున్నాయి.

కౌంటింగ్ తర్వాత రీపోలింగ్ అంటే.. అది చాలా అసాధారణం. ఫలితం తేలకపోతేనే ఆ తరహా నిర్ణయం తీసుకుంటామంటున్నారు. దీనికి కూడా ప్రధానంగా సాంకేతిక సమస్యలే కారణం అవుతాయి. ఈవీఎంలు ఇప్పటికే నెలన్నరగా… స్ట్రాంగ్ రూముల్లో ఉన్నాయి. వాటికి బ్యాటరీలు తీసేసి… అక్కడ ఉంటారు. కౌంటింగ్ రోజున.. బ్యాటరీలు ఆన్ కాకపోయినా… లేకపోతే.. అసలు ఈవీఎం ఓపెన్ కాకపోయినా… ఫలితం తేలదు. అప్పుడు.. ఆ ఈవీఎంకు సంబంధించిన వీవీ ప్యాట్లను లెక్కిస్తారు. పోలయిన ఓట్లకు.. వీవీప్యాట్లకు తేడా ఉంటే మాత్రం… ఫలితాన్ని నిలిపివేస్తారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి విచక్షణాధికారం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు వచ్చిన సమయంలో… మొత్తం నియోజకవర్గం ఫలితాన్ని విశ్లేషిస్తారు. ఎన్ని పోలింగ్ బూత్‌లలో.. ఈవీఎంలు మొరాయించాయో.. లెక్కలేస్తారు. ఆ బూత్‌లలో ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్క తీస్తారు. ఆ ఓట్ల కన్నా.. ఏ అభ్యర్థికయినా.. అత్యధిక మెజార్టీ వస్తే… గెలుపును… ప్రకటిస్తారు. అయితే.. అంత కంటే.. తక్కువ మెజార్టీ ఉండి..ఆ పోలింగ్ బూత్‌లలో ఓట్లే… ఫలితాన్ని నిర్దేశించే పని అయితే.. రీపోలింగ్ నిర్వహిస్తారు.

ఇలాంటి పరిస్థితులు ఉంటాయనే.. కౌంటింగ్ 23వ తేదీన పూర్తయినా సరే.. 27వ తేదీ వరకూ.. కోడ్ అమల్లో ఉంటుందని ద్వివేదీ చెబుతున్నారు. అయితే.. ఈ పరిస్థితులు రాకపోవచ్చనే అంచనా ఈసీ వర్గాల్లో ఉంది. అసలు ఈవీఎం మొరాయిస్తే.. అందులో ఎన్ని ఓట్లు పడ్డాయో.. కౌంటింగ్ చేయడం.. చేయలేదు. ఈసీ వద్ద ఉన్న పత్రాలే.. ప్రామాణికం. వీవీ ప్యాట్లలో పడిన స్లిప్పులు ఎన్ని ఉంటే.. అన్ని… దాని ప్రకారం… సర్దుబాటు చేసేయగలరన్న ప్రచారం జరుగుతోంది. అందుకే… రీపోలింగ్ అవసరం దాదాపుగా రాదని అంటున్నారు. కానీ ఈ ఎన్నికలు.. అత్యంత చిత్ర, విచిత్రాల మధ్య జరిగాయి. ఏం జరిగినా… ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగే రీపోలింగ్ కూడా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close