జీవితారాజశేఖర్‌లు పార్టీ మారడానికి ఓటర్లే కారణమట..!

ఎందుకు పార్టీలు మారుతున్నారంటూ.. అభివృద్ధి కోసం అని చెప్పే రాజకీయ నాయకుల్ని చూశాం కానీ… వింతగా వితండవాదం చేస్తూ.. సమర్థించుకునే రాజకీయ నేతల్ని చాలా పరిమితంగా చూస్తూ ఉంటారు. అలాంటి వారే… రాజశేఖర్, జీవిత. ఏ పార్టీతో వ్యవహారం ఉపయోగకరంగా ఉంటుందనుకుంటే.. ఆ పార్టీలో చేరిపోవడానికి క్షణం కూడా ఏ మాత్రం ఆలోచించని ఈ జంట… ఎన్నికలకు ముందు లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మొదట్లోనూ వారు వైసీపీలో చేరారు. తర్వాత జగన్‌ వ్యక్తిత్వంపై నిందలేసి.. బయటకు వచ్చారు. ఇప్పుడు… మళ్లీ ఆ పార్టీలో చేరారు.

ఓటర్లు ఒకే పార్టీకి ఓటేస్తున్నారా.. ఏమిటి..?

పార్టీలు ఎందుకు మారుతున్నారంటే… జీవిత, రాజశేఖర్ ఇద్దరూ ఏ మాత్రం సిగ్గుపడకుండా.. ఎదురుదాడి చేస్తున్నారు. ఆ ఎదురుదాడి ఎలా ఉందంటే…తాము పార్టీలు మారడానికి ప్రజల్నే కారణంగా చూపిస్తున్నారు. ఓటర్లు ఒకే పార్టీకి ఓటు వేస్తున్నారా ఏమిటి.. ? అంటూ విత్రమైన లాజిక్‌ను మీడియా ముందు ప్రస్తావించారు. ” పార్టీలు మారితే తప్పేంటి? ఓటర్లు ఒక పార్టీకే ఓటేస్తున్నారా? ..ఒక ఎన్నికల్లో ఒక పార్టీకి వేస్తే ఇంకో ఎన్నికల్లో ఇంకో పార్టీకి వేస్తారు… అలాగే సందర్భాన్ని బట్టి నేను పార్టీలు మారాను” అంటూ రాజశేఖర్ కవర్ చేసుకున్న వైనం… మీడియాను కూడా మైండ్ బ్లాంక్ చేసేసింది. ఇంత వరకూ పార్టీలు మారిన రాజకీయ నేతలు ఎవరూ ఇలాంటి కారణాన్ని చెప్పడానికి సాహసం చేయలేకపోయారు. కానీ రాజశేఖర్ మాత్రం అసువుగా చెప్పేశారు.

“మా” ఎన్నికల్లో నాగబాబు వల్ల ఒక్క శాతమే ఉపయోగం..!

తెలుగు భాష సరిగ్గా రాదు కానీ.. ఆయన ఇప్పుడు రాజకీయ నేతల్ని మించి రాజకీయం చేసేసి ఉండేవారని..ఆయన మాటల్ని.. బట్టి.. మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. అంతే కాదు.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో… నాగేంద్రబాబు మద్దతుతో గెలిచారు కదా.. ఆయనకు వ్యతిరేకంగా ఎలా ప్రచారం చేస్తారని… మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా.. అంతే తెలివిగా సమాధానం ఇచ్చారు. నాగబాబు వల్లే ‘మా’కార్యవర్గం గెలవలేదని జీవిత తేలిగ్గా తీసి పడేసారు. ఆయన వల్ల ఒక్క శాతం మేలు జరిగి ఉండొచ్చని మాత్రం… క్రెడిట్ ఇచ్చారు. ఆయన ఒక్క శాతం సాయం చేసి ఉంటారు కానీ.. నాగబాబు వల్లే గెలిచామనడం సరికాదని తేల్చారు.

గాజువాకలో జీవితారాజశేఖర్‌ల ప్రచారం వల్లే పవన్ ఓడిపోయారా..?

అదే సమయంలో…”మా” ఎన్నికల్లో గెలవడానికి సహకరించిన నాగబాబు, పవన్ కల్యాణ్‌లకు వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేశారంటే… వైసీపీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే చేశామని చెప్పుకొచ్చారు. దాని వల్లనే పవన్ ఓడిపోయారన్నట్లుగా రివర్స్‌లో చెప్పుకోవడానికి ఈ జంట ప్రాధాన్యం ఇచ్చారు. నరసాపురంలో మాత్రం నాగబాబుకు.. భీమవరంలో పవన్‌కు.. వ్యతిరేకంగా ప్రచారం చేయలేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి.. రాజకీయాల్లోనూ… జీవిత, రాజశేఖర్ రాటుదేలిపోతున్నారని.. తేలిపోతోంది. వారి తెలివి తేటలతో ఈ సారి ఏపీలో వాళ్లకో మంచి పదవి దక్కే అవకాశం ఖాయంగానే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ … లక్ష్యం అదే..!?

బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తుండటంతో ఆ పార్టీపై పెదవి విరుపులు మొదలయ్యాయి. ...

మోదీ రోడ్ షోలతో కూటమికి మరింత ఊపు !

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close