చంద్రబాబు వర్సెస్ జగన్..! “ప్రజావేదిక” కోసం కుస్తీ షురూ..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చింది. వారం రోజుల పాలన ముగిసింది. ఇప్పటికైతే.. ప్రతిపక్ష పార్టీగా మారిన అధికారపక్షం.. ఆరు నెలల పాటు సంయమనం పాటించాలని అనుకుంటోంది. కానీ..అధికారపక్షంగా మారిన ప్రతిపక్షం వైసీపీ మాత్రం.. సందర్భం సృష్టించుకుని మరీ టీడీపీపై దాడి చేస్తోంది. విజయసాయిరెడ్డి ట్వీట్లు చేస్తున్నారు. ఇఫ్తార్ విందుల్లాంటి చోట్ల నేరుగా జగనే టీడీపీపై మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో.. రెండు పార్టీలు ముఖాముఖి తలపడాల్సిన పరిస్థితి అప్పుడే వచ్చింది.

“ప్రజావేదిక” కోసం టీడీపీ, వైసీపీ ప్రయత్నాలు..!

అమరావతి రాజధానిగా మార్చిన తర్వాత చంద్రబాబు.. ఉండవల్లిలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్న ఆ ఇల్లు… లింగమనేని ఎస్టేట్స్‌కు చెందినది. దానికి ఆయన అద్దె చెల్లిస్తున్నారు. అది ప్రైవేటు ఆస్తి. అయితే.. ముఖ్యమంత్రి నివాసానికి అనుబంధంగా.. ఓ కట్టడాన్ని నిర్మించారు. కీలకమైన సమావేశాలన్నీ.. చంద్రబాబు అందులోనే నిర్వహించేవారు. ప్రభుత్వమైన.. పార్టీ పరమైనా… అధికారులు, పార్టీ నేతలతో.. అక్కడ భేటీ అయి.. పనులు చక్క బెట్టేవారు. దానికి “ప్రజావేదిక” అని పేరు పెట్టారు. అయితే.. దాన్ని నిర్మించింది… మొత్తం ప్రభుత్వ సొమ్ముతోనే. అందుకే.. ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత చంద్రబాబు నాయుడు.. ఆ ప్రజావేదికను ప్రతిపక్ష నేత నివాసంగా గుర్తించాలని లేఖ రాశారు. అయితే.. సాయంత్రానికి వైసీపీ… నేత తలశిల రఘురాం నేరుగా.. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వద్దకు వెళ్లి.. ఆ ప్రజావేదికను.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేటాయించాలని.. లేఖ ఇచ్చారు. పోటాపోటీ లేఖలతో ఒక్క సారిగా ప్రజావేదిక అంశం తెరపైకి వచ్చింది.

అక్రమ కట్టడమని వాదించిన వైసీపీ..! ఇప్పుడెందుకిలా..?

నిజానికి కృష్ణా నది ఒడ్డున.. నిబంధనలకు విరుద్ధంగా.. చంద్రబాబు నివాసం ఉందని.. దాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఉందని.. సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిబంధనలను ఉల్లంఘిచారని.. గతంలో వైసీపీ ఆరోపణలు చేసింది. తాము వస్తే కూలగొడతామని కూడా పలువురు వైసీపీ నేతలు హెచ్చరికలు కూడా చేశారు. ఇలాంటి వారిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ఆయన .. రెండో సారి గెలిచిన తర్వాత .. కరకట్ట మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరిగి… అక్రమ కట్టడాలను నోట్ చేసుకున్నారు. అందులో ఉండవల్లిలోని సీఎం నివాసం కూడా ఉంది. కూలగొట్టడానికి సిద్ధమవుతున్నారని అనుకునేలోపు.. ఆ ప్రజావేదికను నేరుగా.. సీఎంగా జగన్‌కే కేటాయించాలని కోరడం ఆశ్చర్యకరమే.

ప్రతిపక్ష నేతకు ఇవ్వకూడదనే వైసీపీ గేమ్ ప్లానా..?

ప్రతిపక్షనేతకు .. ప్రభుత్వం అమరావతిలోనే ఇల్లు కేటాయించాల్సి ఉంది. ఇప్పుడు తాను ఉంటున్నది ప్రైవేటు వ్యక్తులది కాబట్టి… దానికి అనుబంధంగా ఉన్న ప్రజావేదికను మాత్రం … ఇల్లుగా గుర్తించి.. కేటాయించాలని చంద్రబాబు కోరారు. అలా ఇవ్వడం వైసీపీకి ఎంత మాత్రం ఇష్టం లేదని.. తాజా పరిణామాలతో స్పష్టమయింది. మామూలుగా అయితే.. దీన్ని పెద్ద వివాదాస్పదం చేసే అవకాశం ఉండేది కాదు. కానీ.. ఆ పార్టీ నేతలు.. దాన్ని సీఎంకే కేటాయించాలని లేఖ ఇవ్వడంతో.. చంద్రబాబుకు ఇచ్చే ఉద్దేశం లేదని.. అందుకే… సీఎస్‌కు లేఖ ఇచ్చారని చెబుతున్నారు. అదే నిజమైతే.. ప్రజావేదికను చంద్రబాబు వాడుకునే అవకాశం ఉండదు.

జగన్‌కూ కేటాయించే అవకాశం లేదు..!

సీఎం హోదాలో సమీక్షలు చేయడానికి.. జగన్‌కు ఆ ప్రజావేదిక కావాలని వైసీపీ నేతలు సీఎస్‌కు లేఖ ఇచ్చినప్పటికీ… జగన్ దాన్ని తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే.. పక్కనే … ఆ ప్రజావేదికకు అనుబంధంగా చంద్రబాబు నివాసం ఉంది. అది ప్రైవేటుది. అందులో చంద్రబాబు ఉండగా… పక్కనే జగన్మోహన్ రెడ్డి సమీక్షలు చేయడం అసలు ఊహించలేము. చంద్రబాబుకు ఇవ్వకూడదన్న పంతానికి పోయి.. వేరే వారికి కేటాయించే అవకాశం ఉందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close