ఏదీ ఆనాటి ప్రాధాన్యం..? మోడీతో రామోజీకి చెడిందా..?

ప్రధానిగా నరేంద్రమోడీ రెండో సారి ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. బీజేపీకి ప్రత్యర్థులైన వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక మిత్రుల సంగతి చెప్పాల్సిన పని లేదు. రాజకీయ మిత్రులు మాత్రమే కాదు.. పారిశ్రామిక, సేవా, మీడియా రంగాల నుంచి మోడీకి ఆప్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మోడీ ప్రత్యేకంగా అందరికీ ఆహ్వానాలు పంపారు. అతిథి మర్యాదలు చూసుకున్నారు. 2014లో వచ్చిన వారందరూ ఉన్నారు… అతి కొద్ది మంది తప్ప.. ఆ అతికొద్ది మందిలో ఒకరు.. తెలుగు మీడియా మొఘల్‌గా ప్రసిద్ధి పొందిన రామోజీరావు.

మోడీ ప్రమాణస్వీకానికి రామోజీకి ఏదీ ఆహ్వానం..?

2014లో నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేసే సమయంలో… రామోజీ రావుకు వీవీఐపీ ఆహ్వానం అందింది. ఆయనకు ఢిల్లీలో అద్భుతమైన అతిథి మర్యాదలు అందాయి. ప్రమాణస్వీకార వేడుకల్లో ..దేశాధినేతల్లా.. ఆయనకు మొదటి వరుసలోనే కూర్చునే అవకాశం కూడా లభించింది. ఎందుకంటే.. మోడీతో.. అంతకు ముందు రామోజీరావుకు అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తన మీడియాలో బీజేపీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం.. మోడీకి.. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ నేతగా ప్రొజెక్ట్ చేస్తూ… కావాల్సినంత ప్రచారం ఇవ్వడం కారణం. అంతే కాదు.. మోడీతో.. గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి రామోజీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈటీవీ గుజరాత్ చానల్… హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి బ్రాడ్ కాస్ట్ అవుతుంది. ఈ చానల్ అప్పట్లో గుజరాతీలో నెంబర్ వన్. అప్పడు కూడా..మోడీకి సపోర్ట్‌గా ఉండేది. మోడీ సీఎంగా ఉన్నప్పుడు.. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే.. కచ్చితంగా ఫిల్మ్ సిటీని సందర్శించేవారు. రామోజీతో సమావేశమయ్యేవారు. అక్కడ పని చేస్తున్న గుజరాత్ జర్నలిస్టులతో కాసేపు గడిపేవారు కూడా. అంతగా రామోజీతో అనుబంధం ఉన్న మోడీ… రెండో సారి ప్రమాణస్వీకారానికి.. రామోజీకి ఆహ్వానం పంపలేదు.

పద్మభూషణ్‌ ఇప్పించి మరీ విస్మరించడం ఎందుకు..?

మీడియా రంగంలో… రామోజీ చేసిన కృషిని మెప్పించి పద‌్మభూషణ్ కూడా ఇప్పించారు మోడీ. అలాంటిది రెండో సారి ప్రమాణస్వీకారానికి… ఆహ్వానం పంపకపోవడం… ఆశ్చర్యకరమే. అయితే.. దీనికి రామోజీ.. తన విధానాన్ని మార్చుకోవడమే కారణంగా చెబుతున్నారు. మొదట్లో.. బీజేపీని హార్డ్ కోర్‌గా సపోర్టా చేసిన ఈనాడు.. తర్వాత…అనూహ్యంగా విధానం మార్చుకుంది. మోడీకి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించింది. ఏపీలో మోడీపై తీవ్ర వ్యతిరేకత పెరగడానికి ఈనాడు ప్రచారం కూడా కారణమని.. ఇక్కడి బీజేపీ నేతలు…నివేదికలు పంపారు. ఓ సారి అమిత్ షా .. సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్ వచ్చినప్పుడు..నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లి కలిసి.. మద్దతు కోరారు. అయినా ఈనాడు విధానంలో మార్పు రాలేదు. దాంతో… మోడీ.. రామోజీని.. మద్దతు దారులు, స్నేహితుల జాబితా నుంచి తొలగించాలని ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల్లో ఈనాడు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిందనే కోపమా..?

నిజానికి తెలుగుదేశం పార్టీ తీసుకునే రాజకీయ నిర్ణయాల వెనుక కచ్చితంగా రామోజీరావు హస్తం ఉంటుందన్న ప్రచారం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వెనుక రామోజీ సలహా ఉండే ఉంటుందని కూడా చెప్పుకున్నారు. బద్దశుత్రవైన… కాంగ్రెస్‌తో… టీడీపీ కలవకుండా ఆపడం చేయాల్సింది పోయి… కలిసి.. కాంగ్రెస్ ను బలోపేతం చేసే ప్రయత్నం చేయడం మోడీకి నచ్చలేదంటున్నారు. బహుశా.. అందుకే… మోడీ.. రామోజీరావును.. తన మిత్రుల జాబితా నుంచి తొలగించి ఉంటారని చెబుతున్నారు. బహుశా అందుకే ఆహ్వానం అందలేంటున్నారు. ఏదేమైనా మొత్తానికి … మోడీకి ఇప్పుడు రామోజీరావు ఆప్తుడు కాదన్న మాట మాత్రం నిజం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close