అరాచక పాకిస్తాన్ ను పొగిడేందుకు తయార్ !?

కరాచీ సాహిత్యీ ఉత్సవానికి భారత్ నుంచి 17 మంది ప్రముఖులు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈనెల 5 నుంచి 7 వరకు వివిధ అంశాలపై వీరు తమ అభిప్రాయాలను వివరిస్తారు. మన వాళ్లచేత, తన భూభాగం మీద, తనను పొగిడించుకుని, భారత్ ను తిట్టించడానికి పాకిస్తాన్ వేసిన మాస్టర్ ప్లాన్ గా ఇది కనిపిస్తోంది.

దాద్రీ ఘటనకు నిరసనగా అవార్డ్ వాపసీ ఉద్యమానికి తెరలేపిన నెహ్రూ మేనకోడలు నయన తార సెహగల్ కీనోట్ స్పీకర్ గా వెళ్తున్నారు. సినీ నటి, ఫైర్ తార నందితా దాస్ కూడా ఈ బృందంలో ఉన్నారు. మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటూనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఈమె ప్రత్యేకత. ఇలాంటి వాళ్లు పాకిస్తాన్ వెళ్లి భారత్ ప్రభుత్వాన్ని తిట్టడానికి సిద్ధమయ్యారు. మోడీని నోరారా తిట్టి, పాకిస్తాన్ ను వేనోళ్ల పొగడటానికి చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు.

ఇంతకీ పాకిస్తాన్ చాలా గొప్ప దేశమా? అక్కడ అసహన లేనేలేదా? ఓ వైపు అనుపమ్ ఖేర్ కు వీసా ఇవ్వనందుకు పాకిస్తాన్ క్షమాపణ చెప్తున్న సమయంలోనే, ఆ దేశంలో మరో హిందూ ఆలయాన్ని ముష్కరమూకలు కూల్చివేశాయి. చుట్టుపక్కల నివసించే హిందువులు బిక్కుబిక్కుంటూ బతుకుతున్నారని వార్తలు వచ్చాయి. మన దేశంలో అసహనం పెరుగుతోందని గగ్గోలు పెట్టిన నయనతార, 88 ఏళ్ల వయసులో పాకిస్తాన్ వెళ్లి, అక్కడ అసహనం లేదని, భారత్ లోనే ఉందని చాటి చెప్తారా? ఒకప్పుడు పాకిస్తాన్ లో కోట్లలో ఉన్న హిందువుల సంఖ్య ఇప్పుడు వేలకు పడిపోయిన కారణం ఆమెకు తెలియదా?

పాకిస్తాన్ అంటే ఓ దుష్ట దేశం. తాను పెంచి పోషించిన ఉగ్రవాదానికి తానే బలవుతున్న మూర్ఖ దేశం. మన దేశానికే కాదు, మానవత్వానికే అది శత్రు దేశం. ఆడవాళ్లు కాస్త బట్టలు వేసుకుని బయటకు రావాలని ఎవరైనా అనగానే, మోరల్ పోలిసింగ్ విరుచుకు పడటం నందితా దాస్ అలవాటు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లుంటారు. మనిషి జంతువులా ప్రవర్తించినా ఎవరూ అడగ కూడదనే అల్ట్రా మోడ్రన్ నందితా దాస్ కరాచీ వెళ్లి ఏం ఉద్ధరిస్తారో చూడాలి. కాశ్మీరీ పండితుల ఊచకోతను, ఉగ్రవాదులకు మద్దతిచ్చిన పాకిస్తాన్ ను ఇటీవల అనుపం ఖేర్ తీవ్రంగా విమర్శించారు. ఇది నందితా దాస్ కు నచ్చనట్టుంది. మంగళవారం రాత్రి ఓ టీవీ షోలో మాట్లాడుతూ అనుపమ్ కు కామన్ సెన్న్ లేదని తిట్టారు.

కాశ్మీర్ నుంచి లక్షల మంది పండితులను ఉగ్రవాదులు తరిమికొట్టారు. కుటుంబ సభ్యుల ముందే వందల మంది యువతకులను చెరిచారు. వేల మంది ఆడవాళ్లను ఎత్తుకు పోయారు. ఈ అరాచకాలు చేసింది పాకిస్తానీ ముస్లింలు కాబట్టి నందితాకు నచ్చి ఉండొచ్చు. ఇంతటి ప్రమాదకరమైన జాతి వ్యతిరేక శక్తులు కరాచీలో పాకిస్తాన్ ను పొగడటానికి పోటీ పడటం ఆశ్చర్యం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే నచ్చదు కాబట్టి ఆయన్ని చులకన చేయడం కోసం పాకిస్తాన్ ను కీర్తిస్తారు. ఈ ఉద్దేశంతోనే పాక్ వ్యూహాత్మకంగా అవార్డ్ వాపసీ బ్యాచ్ ను, నందితా దాస్ వంటి భారత వ్యతిరేక భావ జాలం గలవారిని ఏరికోరి మరీ పిలిచింది. ఈ ఫెస్ట్ అయిపోగానే, చూశారా భారతీయులే మా దేశానికి వచ్చి మమ్మల్ని పొగిడారు. భారత్ ప్రభుత్వాన్ని పొగిడారు. అని ప్రపంచానికి చెప్పుకోవడానికి పాపిస్టి పాకిస్తాన్ చేతికి ఓ బలమైన అస్త్రాన్ని ఇచ్చి వస్తారా, లేక అక్కడి అసహనాన్ని, అరాచకాలను గురించి కూడా మాట్లాడతారా? చూద్దాం!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close