ప్రత్యేకహోదానే ఏపీకి శ్వాస..! మళ్లీ..మళ్లీ అసెంబ్లీ తీర్మానం..!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ.. అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. విభజనతో ఆంధ్రప్రదేశ్ అన్ని అన్నిరంగాల్లో నష్టపోయిందని.. విభజన నష్టాలను ప్రత్యేక హోదా ద్వారానే పూడ్చుకోవచ్చని హోదా తీర్మానంలో సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరి. హోదా వస్తేనే రాయితీలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా జీవనాడి అయినందున జాప్యంలేకుండా వెంటనే ఇవ్వాలని ఐదు కోట్లమంది ప్రజల తరఫున హోదా కావాలని తీర్మానం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తీర్మానాన్ని బలపరిచే సందర్భంలో… ఇరు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు చోటు చేసుకున్నాయి. 2014 ఎన్నికల తర్వాత కూడా ఏడాదిన్నర పాటు ప్లానింగ్‌ కమిషన్‌ ఉందని.. అయినా ప్లానింగ్‌ కమిషన్‌ను ఒక్కసారి కూడా గత ప్రభుత్వం కోరలేదని.. జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేకహోదా ఇచ్చేది కేంద్రం మాత్రమేని… నిర్ణయాధికారం కేంద్ర కేబినెట్‌దేని జగన్ స్పష్టం చేశారు. ఏపీకి హోదాపై యూపీఏ కేబినెట్‌ ఆమోదం తెలిపి… ప్లానింగ్ కమిషన్‌కు ఆదేశాలు ఇచ్చిందన్నారు. హోదాను అమలు చేయాలని ప్లానింగ్‌ కమిషన్‌ను కోరితే సరిపోయేదని.. కానీ చంద్రబాబు కనీసం లేఖ కూడా రాయలేదని మండిపడ్డారు. చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఇప్పటికే హోదా వచ్చేదన్నారు. హోదాతో రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వచ్చేవని జగన్ వ్యాఖ్యానించారు. హోదాపై యూపీఏ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చాక.. మళ్లీ ప్రధాని దగ్గరకు చంద్రబాబుకు ఎందుకు వెళ్లారని జగన్ ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలు ఇవ్వకపోతే .. ప్రమాణస్వీకారం చేయనని చెప్పిన చంద్రబాబు.. ప్రత్యేక హోదాపై ఎందుకు ఆ డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా మన శ్వాస అని.. కేంద్రం మనసు కరిగే వరకు హోదాపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని ప్రకటించారు.

దీనిపై చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తనపై బురద జల్లితే ప్రత్యేక హోదా రాదన్నారు. హోదాపై తాను రాజీపడలేదని… 29 సార్లు ఢిల్లీ వెళ్లానని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీకి హోదా ఇవ్వాలని ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరానని … అసవు ప్రధానే ఒప్పుకోకుంటే ప్లానింగ్ కమిషన్‌ ఎలా ఒప్పుకుంటుందని.. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఐదేళ్ల కాలంలో 29 సార్లు వెళ్లి హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరానని చంద్రబాబు గుర్తు చేసారు. హోదా సాధిస్తామని చెప్పి వైసీపీ ఎన్నికల్లో గెలిచిందన్నారు. తానే కాదు.. మీరు కూడా ఢిల్లీ వెళ్లి శాలువాలే కప్పుతున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. హోదా ప్రయోజనాలన్నీ కల్పిస్తామంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నాంమన్నారు. హోదా కోసం అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రకటించారు.

సంఖ్యాబలం ప్రకారం.. వైసీపీ సభ్యులకు అధికంగా మట్లాడే అవకాశం రావడంతో.. వైసీపీ ఎమ్మెల్యేలంతా.. చంద్రబాబునే టార్గెట్ చేశారు. ప్రత్యేకహోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లినా సాధించిందేమీ లేదని బుగ్గన ఎగతాళి చేసే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందు వరకూ టీడీపీ ఎంపీ ఉండి.. హోదా కోసం.. గట్టిగా పోరాడామని చెప్పుకున్న అవంతి శ్రీనివాస్ ఇప్పుడు మంత్రి హోదాలో.. చంద్రబాబు హోదాపై యూటర్న్ తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. మొత్తానికి హోదా తీర్మానం… కేంద్రం కోసం అన్నట్లుగా కాకుండా.. ప్రత్యేకహోదా గతంలో చంద్రబాబు వల్లే రాలేదని గుర్తు చేయడానికన్నట్లుగా… సాగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో...

కవిత బెయిల్ రిజెక్ట్ – ఇప్పుడల్లా కష్టమే !

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టి వేసింది. గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా...

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close