“ప్రజావేదిక” ఒక్కటేనా.. కరకట్ట మొత్తం ఖాళీ చేస్తారా..?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ కట్టడాలు అనేవి లేకుండా చేయాలని పంతం పట్టారు. అందుకే.. తాను కలెక్టర్ల సమావేశం పెట్టిన ప్రజావేదిక నుంచే.. కూల్చడం ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల సమావేశం ముగిసిన తర్వాతి రోజే.. దాని సంగతి చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. అదొక్కటే కాదు.. అక్కడ్నుంచే ప్రారంభం.. రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్చేయాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన మాటలతో తేలిపోతోంది.

ప్రభుత్వ ఆస్తి కాబట్టి అడ్డం ఎవరూ రారు..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ప్రజావేదికను అక్రమ కట్టడంగా తేల్చారు. అవినీతి సొమ్ముతో కట్టినదని కూడా చెప్పారు. బహుశా.. ఆ సమయంలో.. ఆయనకు అది ప్రభుత్వం సొమ్ముతో కొట్టినదన్న విషయం గుర్తుకు వచ్చి ఉండకపోవచ్చు. దాదాపుగా రూ. ఎనిమిదిన్నర కోట్ల ప్రజాధనంతో దాన్ని నిర్మించారు. గత ప్రభుత్వం.. అక్కడ ఎన్నో సమావేశాలు పెట్టి.. స్టార్ హోటళ్లలో సమావేశ ఖర్చులను చాలా వరకు మిగుల్చుకుంది. ఇప్పటి ప్రభుత్వానికి కలెక్టర్ల మీటింగ్ లాంటి.. పెద్ద సమావేశాలు పెట్టాలంటే.. అంతకు మించిన ఏర్పాట్లు లేవు. అయినా.. అది సీఎం అక్రమ కట్టడంగా తేల్చారు కాబట్టి… దాన్ని కూల్చేయమని ఆదేశించారు. అది ప్రభుత్వ ఆస్తి కాబట్టి… ఎవరూ అడ్డం రారు. మహా అయితే.. టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తారు. కానీ.. వారికి అడ్డుకునే అధికారం లేదు.. ఆందోళన మాత్రమే చేయగలుగుతారు.

కరకట్టను ఖాళీ చేయిస్తే.. సీఎంకు పట్టుదల ఉన్నట్లే..!?

అమరావతిలో ప్రజావేదికతోపాటు కృష్ణా నది కరకట్ట దిగువనున్న అక్రమనిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తే ముఖ్యమంత్రి జగన్ మాటలకు విశ్వసనీయత వస్తుంది. నదీ పరిరక్షణ చట్టాన్ని సీఎం చక్కగా అమలుచేశారని జనం కూడా అనుకుంటారు. కానీ కరకట్ట వ్యాప్తంగా… అనేక మంది బడాబాబుల గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. చంద్రబాబు ఉంటున్న ఇల్లు లింగమనేని ఎస్టేట్‌ది. అలాగే.. ప్రజావేదికకు ఆ పక్కనే భాజపా మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ ఉంది. అమిత్ షా సహా… బీజేపీకి చెందిన పెద్దలెవరైనా.. విజయవాడకు వస్తే బస చేసేది అక్కడే. అంతే కాదు.. గోకరాజు గంగరాజు ఆశీస్సులతో.. అక్కడ మంతెన సత్యనారాయణ ఆశ్రమం నడుపుతున్నారు. అది ఇంకా పెద్దది. దాన్ని కూడా కూల్చాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి… ఒక్క ప్రజావేదికను కూల్చేసి.. సరి పెడితే.. అది రాజకీయ కక్ష సాధింపుగా ఉంటుంది. మొత్తాన్ని క్లియర్ చేస్తేనే.. ఆయనకు పట్టుదల ఉందని ప్రజలు భావిస్తారు.

అక్రమ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోరా..?

జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు చేయాల్సింది.. అక్రమ కట్టడంగా తేల్చిన ప్రజావేదికను కూల్చడం మాత్రమే కాదు. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులు ఒత్తుతూ.. వారు ఏం చెపితే.. అది నిబంధనలకు విరుద్ధమైనా సరే.. చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే.. మరోసారి ప్రభుత్వ పరంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలు పుట్టుకురాకుండా ఉంటాయి. ప్రజావేదిక నిర్మాణాన్ని పర్యవేక్షించిన… నిధులు మంజూరు చేసిన అధికారులందరిపైనా సీఎం చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిత్రపురి కాలనీపై కన్నేసిన మంత్రి..!?

సినీ కార్మికుల ఇండ్ల కోసం కేటాయించిన హైదరాబాద్ చిత్రపురి కాలనీపై ఓ మంత్రి కన్నేశారా..? తను కోరినట్లుగా ప్లాట్లు ఇస్తే సరేసరి, లేదంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయేలా చేస్తానని బెదిరించారా..? అధికారులు సైతం...

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

HOT NEWS

css.php
[X] Close
[X] Close