ఆయన ట్వీటంటే మాస్.. “ఊర”మాస్ ..!

విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. రోజువారీగా.. టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అంతకు ముందు రోజు ఎవరైతే.. వైసీపీపై ధాటిగా విమర్శలు చేస్తారో.. వారినే గురి పెడుతున్నారు. అధికార పక్షంలోకి మారిన తర్వాత కూడా.. ఆయన ట్వీట్లలో శైలి మారడం లేదు. వ్యక్తిగత విమర్శలకూ వెనుకాడటం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఎంతగా … విమర్శించారో.. అధికారపక్షానికి మారినా.. ఏ మాత్రం తేడా రానీయడం లేదు. లోకేష్‌ను.., దేవినేని ఉమను.. వ్యక్తిగతంగా.. విమర్శించి.. ఒక్క రోజే హాట్ టాపిక్ అయ్యారు. మంగళగిరి ప్రజలు ఈడ్చికొట్టడంతో..   లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుందని ఓ ట్వీట్ చేశారు. దేవినేని ఉమపై … ఆయన వదినను చంపినట్లు అర్థం వచ్చేలా సందర్భం లేకపోయినా ట్వీట్లు పెట్టి తనకు ఎలాంటి పరిమితులు లేవని చెప్పకనే చెప్పారు.

విజయసాయిరెడ్డి ఈ తరహా ట్వీట్లు…  ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు. ఈ ట్వీట్లలో ప్రత్యేకత.. ఎవరినైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. రాజకీయ విమర్శలు చేసిన వారిపై.. వ్యక్తిగత విమర్శలు చేయడం ఏమిటని..నెటిజన్లు కౌంటర్లు ఇచ్చినా.. విజయసాయిరెడ్డి పెద్దగా పట్టించుకోరు. గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడంలో.. విజయసాయిరెడ్డి శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా..  ఔరా అనిపించుకునేలా..కొన్ని వాక్యాలు పెడతారు. మిగతా అంతా మీరు ఊహించుకోండి అన్నట్లుగా ఉంటుంది. దోమలు.. ఆడో..మగో తెలుసు కోవడానికి ప్రభుత్వం కోటిన్నర ఖర్చు పెట్టిందని … ఇది ప్రపంచంలోనే మొదటి సారని.. ట్వీట్ చేశారు. ఇలాంటి ట్వీట్లతో ప్రజల్లో చర్చను రెకేత్తిస్తారు. అయితే..  అసలు ఆ దోమలేమిటో..  పూర్తి సమాచారం మాత్రం.. బయట పెట్టరు. నిజానికి అలాంటిది జరిగితే.. పూర్తి వివరాలు బయటపెడితే..అసలు నిజం ఏమిటో తెలిసిపోతుంది. అదంతా తెలియకపోయినా పర్వాలేదని.. విజయసాయి..  ట్వీట్లు పెడతారు. ఆ ట్వీట్ పై.. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో… మీమ్స్ తయారు చేసి.. టీడీపీపై దాడి చేస్తారు.

ప్రజావేదిక ఖర్చు, కరెంటు ఒప్పందాల్లో అవకతవకలపైనా…  విజయసాయిరెడ్డి ఇదే తరహా ట్వీట్లు చేశారు. అప్పుడప్పుడు.. ప్రభుత్వాన్ని సమర్థించుకునేందుకు…  విచిత్రమైన లాజిక్‌లతో.. పెట్టే ట్వీట్లతో విమర్శలు వచ్చినా వెనుకడుగు వేయరు. కరకట్టపై .. ఉన్న ఇళ్లన్నింటికీ వైఎస్ హయాంలోనే అనుమతలు వచ్చాయని.. వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ… తుగ్లక్ అనే పదం వాడారు. అది రివర్స్ అయింది.  అయినప్పటికీ.. విజయసాయిరెడ్డి ట్వీట్లలోఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.  విజయసాయిరెడ్డి ట్వీట్‌కు .. టీడీపీ నేతలు.. అదే స్థాయిలో సమాధానాన్ని ట్విట్టర్‌లో ఇస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. అయితే.. వీటికి వేదికగా ట్విట్టర్‌ను విజయసాయిరెడ్డి మార్చేశారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close