కెసిఆర్ కి మేలు చేసేందుకే అమరావతి బ్రాండ్ ఇమేజ్ తగ్గిస్తున్నారంటున్న కేశినేని నాని

తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల లో ఆసక్తి కలిగిస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజలను ఆలోచింప జేస్తున్నాయి. తక్కువ పదాలతో ఆయన చేస్తున్న పోస్ట్ లు అధికార ప్రభుత్వాన్ని సునిశితంగా విమర్శించేలా సాగుతున్నాయి.
ఇక కేశినేని చేసిన తాజా వ్యాఖ్యలు, “అమరావతిని కూల్చేద్దాం…హైదరాబాద్ ని అభివృద్ది చేద్దాం…”- చర్చనీయాంశంగా మారాయి. జగన్ ముఖ్యమంత్రి కాగానే అమరావతిలో నిర్మాణాలని, వాటి వెనుక ఉద్దేశాలను పునఃపరిశీలిస్తామని చెప్పగానే, అమరావతి లో   రియల్ ఎస్టేట్ కాస్త మందగించడం, ఇప్పుడు కరకట్ట మీద కట్టడాలు కూల్చి వేస్తుండడం కారణంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు సందేహిస్తూ ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో, అమరావతిలో రియల్ ఎస్టేట్ మందగించడం కారణంగా ఆ మేరకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో బూమ్ కనిపిస్తోంది. పైగా, కెసిఆర్ ప్రతిపాదనలకు చాలా వరకు జగన్ ఒప్పు కుంటూ ఉండడం కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
ఏది ఏమైనా,  సంక్షేమంతో పాటు అభివృద్ధి మీద కూడా దృష్టి సారించాల్సి ఉంది. అభివృద్ధి లేకుండా సంక్షేమం మీద ఫోకస్ చేస్తే ఖజానా ఖాళీ అయ్యే  అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే, తద్వారా వచ్చే ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆదర్శప్రాయ వ్యక్తిగా తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్న తమ్మినేని..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. తనను తాను ఆదర్శప్రాయ వ్యక్తిగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఆదర్శ ప్రాయ వ్యక్తిగా.. స్పీకర్ హోదాలోనే కోర్టులపై కామెంట్లు చేశానని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై.. తమ్మినేని సీతారాం రెండురోజుల...

ఇక రామ్ చ‌ర‌ణ్… వెబ్ సిరీస్‌

రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌లు వినోద రంగాన్ని ఆక్ర‌మించ‌బోతున్నాయి. సినిమాల్ని మించిన మేకింగ్‌, కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. వాటి ప్రాధాన్య‌త‌ని స్టార్లు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. స‌మంత‌, త‌మ‌న్నా లాంటి...

బాల‌య్య‌తో అమ‌లాపాల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. `మోనార్క్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. బాల‌య్య పుట్టిన రోజున‌... ఓ ప‌వ‌ర్ ఫుల్ టీజ‌ర్ విడుద‌ల చేశాడు...

అమరావతి విషయంలో ప్రధానిపై భారం వేస్తున్న చంద్రబాబు..!

అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా... దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు..వర్గాలు..మేధావుల నుంచి మద్దతు లభిస్తోంది. వర్చవల్ పద్దతిలో అందరూ.. పెద్ద ఎత్తున తమ సంఘిభావం తెలియచేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close