గ‌దిలో ఉండేది త‌మ‌న్నా కాదు.. తాప్సి?

ఓంకార్ `రాజుగారి గ‌ది 3`కి అర్థాంత‌రంగా బ్రేక్ ప‌డింది. ఈ సినిమా నుంచి త‌మ‌న్నా వాక్ అవుట్ అయ్యింది. స్క్రిప్టులో మార్పులు చేర్పుల‌కు ఓంకార్ ఒప్పుకోక‌పోవ‌డంతోనే త‌మ‌న్నా ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంద‌ని టాక్‌. త‌మ‌న్నా స్థానంలో ఎవ‌రిని తీసుకోవాలో తెలీక ఓంకార్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇది వ‌ర‌కే ఈ క‌థ స‌మంత ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. స‌మంత సున్నితంగా తిర‌స్క‌రించ‌డంతో కొన్ని మార్పులు చేసి త‌మ‌న్నా ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాడు. ఇప్పుడు త‌మన్నా కూడా త‌ప్పుకుంది.

ఓంకార్ ముందున్న బ‌ల‌మైన ప్ర‌త్యామ్నాయం.. తాప్సి. ఈమ‌ధ్య తాప్సి లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల‌తోనే ప్ర‌యాణం చేస్తోంది. మంచి విజ‌యాల్నీ అందుకుంటోంది. తాప్సి అయితే ఈ క‌థ‌కు న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని ఓంకార్ భావిస్తున్నాడు. పైగా తాప్సికి ఇప్పుడు మార్కెట్ పెరిగింది. తాప్సి తోడైతే ఈ సినిమాని హిందీలోనూ అమ్ముకునే ఛాన్స్ ఉంది. అయితే తాప్సి క‌థ‌ల విష‌యంలో చాలా బెట్టు చూపిస్తోంది. త‌మ‌న్నానే కాద‌న్న క‌థ‌ని తాప్సి ఎలా ఒప్పుకుంటుంద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. త‌మ‌న్నా చెప్పిన మార్పులు చేసేసి.. మ‌ళ్లీ త‌మ‌న్నానే ఈ క‌థ‌లోకి తీసుకురావాలా? లేదంటే తాప్సిని ఎలాగైనా ఒప్పించి ప్రాజెక్టుని ప‌ట్టాలెక్కించాలా? అనే విష‌యంలో ఓంకార్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాడు. ఏం తేలుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close