టిఆర్ఎస్ పై బిజెపి ముప్పేట దాడి మొదలెట్టిందా?

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పూర్తిగా బలపడాలని, వీలైతే అధికారంలోకి కూడా రావాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్న బిజెపి నెమ్మది నెమ్మదిగా టీఆర్ఎస్ పై ముప్పేట దాడి మొదలుపెట్టినట్లు గా అర్థమవుతోంది. వివరాల్లోకి వెళితే..

గత అయిదేళ్లలో ప్రజారంజకంగా పాలించిన కెసిఆర్, రెండవ విడత ముఖ్యమంత్రి కాగానే ప్రజలలో ప్రతికూలతను మూటగట్టుకున్నాడు. ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా జరిగిన ఆత్మహత్యలు ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెంపొందించాయి. అయితే ఆ సమస్యను మీడియా మరింత పెద్దదిగా చేయకుండా చేయడం లో టిఆర్ఎస్ సఫలీకృతం అయినప్పటికీ బిజెపి మాత్రం ఈ సమస్యను అంత తేలిక గా వదలకూడదు అన్నట్లుగా ఉంది. మొన్నామధ్య ఈ సమస్యపై అమిత్ షా నివేదిక తెప్పించుకోవడానికి ప్రయత్నించగా ఇప్పుడు ఈ సమస్యను పార్లమెంటులో కూడా లేవనెత్తారు. అదేవిధంగా అటవీశాఖ అధికారి పై టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన అంశం పై కూడా పార్లమెంటులో ప్రస్తావించారు. దీంతో టీఆర్ఎస్ వైపు నుండి ఏ చిన్న పొరపాటు జరిగినా, టిఆర్ఎస్ పార్టీని తీవ్ర ఇరకాటంలో పెట్టడానికి బీజేపీ ఏమాత్రం వెనకాడటం లేదు అన్న సంకేతాలు రాజకీయ వర్గాల్లో కి బలంగా వెళ్లాయి. ఇటు తెలంగాణా సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించడమే కాకుండా మరొక వైపు రాష్ట్ర స్థాయిలో బలపడడానికి కూడా బిజెపి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలోని నాయకులకు బిజెపి తలుపులు బార్లా తెరిచి ఉంచి ఉంది.

ఒకవైపు బిజెపిలోకి లీడర్లను చేర్చుకోవడం, మరొకవైపు టిఆర్ఎస్ ఏ పొరపాటు చేసినా దానికి బిజెపి వైపు నుండి పెద్ద ఎత్తున కౌంటర్ ఉంటుందని సంకేతాలు రావడం, టిఆర్ఎస్ అధిష్టానంలో అసహనాన్ని కలిగిస్తున్నట్లు గా సమాచారం. అయితే అసెంబ్లీలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే కలిగిన ఈ పార్టీపై అసహనాన్ని నేరుగా వ్యక్తం చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే భయం కూడా టిఆర్ఎస్ పెద్దల లో కనిపిస్తోంది. దీంతో నేరుగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్న ట్టు గా ఎదుర్కొనలేక, అలాగని చూస్తూ వదిలేయ లేక, టిఆర్ఎస్ లో బిజెపి ని ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద టి.ఆర్.ఎస్ మీద బిజెపి ముప్పేట దాడి మొదలు పెట్టిందని, టిఆర్ఎస్ చేయబోయే పొరపాట్లను ఒక్కొక్క దాన్ని మెట్టుగా మలుచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తన భవిష్యత్తుకు సోపానాలు వేసుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరి ఈ ప్రయత్నంలో బిజెపి ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అన్నది వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close