రాజ‌మౌళి కోసం… ‘సైరా’??

సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసుకోవడం, విడుద‌ల‌కు ముందు ప‌దే ప‌దే చూసుకుంటూ, మార్పులు చేర్పులూ చేసుకుంటూ వెళ్ల‌డం – టాలీవుడ్‌కి అల‌వాటుగా మారుతోంది. విడుద‌ల‌కు ముందు హ‌డావుడిగా సినిమా ముగించ‌డం, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఉరుకులు ప‌రుగుల మీద చేయ‌డం, వేడి వేడిగా సినిమాని విడుద‌ల చేసేసి – ఆ త‌ర‌వాత `అయ్యో ఈ త‌ప్పు జ‌రిగిందా?` అని ఫీల‌వ్వ‌డం బ‌దులు.. ఇదే బెట‌ర్ కూడా. నాగార్జున సినిమాల‌న్నీ ఇదే ప్రాతిప‌దిక‌న సాగుతుంటాయి. డి.సురేష్ బాబు వ్యూహం కూడా ఇదే. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులంతా.. ఈ చెక్కుడు కార్య‌క్ర‌మాల్లో ఆరి తేరిపోతున్నారు. ఇప్పుడు ‘సైరా’ ప‌ద్ధ‌తీ ఇంతే.

`సైరా` షూటింగ్ ఇటీవ‌లే ముగిసింది. ఇప్పుడు ర‌షెష్ చూసుకుంటూ క‌రక్ష‌న్లు చేసుకుంటూ వెళ్తోంది చిత్ర‌బృందం. చిరంజీవి ఈసినిమా విష‌యంలో చాలా శ్ర‌ద్ద తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. తొమ్మిదేళ్ల త‌ర‌వాత క‌మ్ బ్యాక్ ఫిల్మ్‌గా వ‌చ్చిన ‘ఖైదీ నెం 150’ కంటే ఈ సినిమా విష‌యంలో చిరు ప‌ట్టుగా ఉన్నాడ‌ని మెగా కాంపౌండ్ వ‌ర్గాలే చెబుతున్నాయి. ‘ఖైదీ నెం 150’ విష‌యాలన్నీ వినాయ‌క్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌కే వ‌దిలేసిన చిరు – ‘సైరా’ విష‌యానికి వ‌చ్చేస‌రికి ప్ర‌తీ విష‌యంలోనూ క‌ల‌గ చేసుకుంటున్నార‌ని చెబుతున్నారు. ఇండ్ర‌స్ట్రీలో త‌న‌కు ఆప్తులైన కొంత‌మందికి ఇప్ప‌టికే ‘సైరా’ ర‌షెష్ చూపించార‌ట చిరు. వాళ్లు చెప్పిన మార్పులూ చేర్పుల్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని మెరుగులు దిద్దుతూ వెళ్తున్నార‌ని తెలుస్తోంది. చిరుకి అత్యంత ఆప్తుడైన ర‌చ‌యిత స‌త్యానంద్‌కి ఈ సినిమాలోని ర‌షెష్ చూపించార‌ని వినికిడి. త్వ‌ర‌లో కె.రాఘ‌వేంద్ర‌రావుకీ ‘సైరా’ ర‌షెష్‌ని చూపించాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. వీలైతే రాజ‌మౌళికీ `సైరా`ని ముందే చూపించి స‌ల‌హాలు తీసుకోవాల‌ని చిరు భావిస్తున్నాడ‌ట‌. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్ర‌మిది. ఇలంటి సినిమాలు తీయ‌డంలో ఆరితేరిపోయాడు రాజ‌మౌళి. త‌న స‌ల‌హ‌లు ఈ సినిమాకి త‌ప్ప‌కుండా ప‌నికొస్తాయి. మ‌రి రాజ‌మౌళికి స్పెష‌ల్ స్ర్కీనింగ్ ఎప్పుడో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దటీజ్ పవన్ – ముద్రగడకు గౌరవం !

కుటుంబాల్లో చిచ్చు పెట్టడం వైసీపీ రాజకీయవ్యూహంలో ఒకటి. రామోజీరావు కుటుంబం నుంచి దేవినేని ఉమ కుటుంబం వరకూ ఎక్కడ చాన్స్ వచ్చినా వదిలి పెట్టలేదు. కానీ జనసేన చీఫ్ పవన్...

జగన్‌పై సీఐడీ కేసు పెట్టక తప్పదా !?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు ఫిర్యాదు చేస్తే వెంటనే సీఐడీలోని ఫలానా అధికారి విచారించాలని సీఈవో కార్యాలయం నుంచి ...

ఈసీ ఫెయిల్యూర్ – పోస్టల్ బ్యాలెట్స్ ఇలానా ?

ఏపీ ఎన్నికల సంఘం పనితీరు అత్యంత ఘోరంగా ఉంది. కనీసం పోస్టల్ ఓటింగ్ ను సరైన పద్దతిలో నిర్వహించడం కూడా చేత కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ స్మూత్ నిర్వహించడానికి...

‘హీరామండి’ వెబ్ సిరిస్ రివ్యూ: నయనానందమే కానీ…

Heeramandi Web Series Review సంజయ్ లీలా భన్సాలీ.. ఇండియన్ సినిమాలో పరిచయం అవసరం లేని దర్శకుడు. భారీదనం ఉట్టిపడే కళాత్మక చిత్రాలతో పేరుతెచ్చున ఆయన ఇప్పుడు వెబ్ వరల్డ్ లోకి అడుగుపెట్టారు. ఆయన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close