బాలీవుడ్‌కి వెళ్తున్న సందీప్ సినిమా

వ‌రుస ఫ్లాపుల నుంచి తేరుకోవ‌డానికి సందీప్ కిష‌న్ చాలానే క‌ష్ట‌ప‌డుతున్నాడు. త‌న కొత్త సినిమా ‘నిను వీడ‌ని నీడ‌ని నేనే’కి భారీ ఎత్తున ప్ర‌మోష‌న్లు క‌ల్పిస్తున్నాడు. ఈ సినిమాపై బాగా న‌మ్మ‌కంగానూ క‌నిపిస్తున్నాడు. వ్యాపార ప‌రంగానూ ఈ సినిమా సందీప్‌లో కొత్త ఆశ‌ల్ని రేకెత్తిస్తోంది. ఓవ‌ర్సీస్‌, నైజాం త‌ప్ప మిగిలిన ఏరియాల‌న్నీ మంచి రేట్ల‌కే అమ్ముడ‌య్యాయి. ఇప్పుడు హిందీ రీమేక్ రైట్స్ రూపంలో కూడా డ‌బ్బులొచ్చాయి. “హిందీలో ఈ సినిమాని ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ రీమేక్ చేస్తోంది. ఆ సినిమాలో మాత్రం నేను న‌టించ‌డం లేదు” అని సందీప్ కిష‌న్ తెలిపారు.

“ఈమ‌ధ్య తెలుగు సినిమాల‌పై హిందీ నిర్మాత‌ల దృష్టి ప‌డింది. కాక‌పోతే వాళ్ల‌కు చాలా కండీష‌న్లు ఉంటాయి. సినిమా ఎంత బాగా తీసినా.. ఇక్క‌డ బాలేదు, అక్క‌డ మార్చాలి అంటూ కొన్ని స‌వ‌ర‌ణ‌లు చెబుతుంటారు. కానీ.. `నిను వీడ‌ని నీడ‌ను నేనే` చూశాక అలాంటి మాట ఒక్క‌టీ మాట్లాడ లేదు. హిందీలో మేం ఈ సినిమా చేస్తున్నాం అని ఎగ్రిమెంట్ల‌పై సంత‌కాలు చేశారు. దాంతో ఈ సినిమాపై నాకు మ‌రింత న‌మ్మ‌కం పెరిగింది” అని చెప్పుకొచ్చాడు. ఈ శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close