అసెంబ్లీ భేటీ : ప్రతిపక్షానికి గౌరవం దక్కుతుందా..?

అధికార, ప్రతిపక్ష వ్యూహ, ప్రతివ్యూహాలతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేడి పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. 14 రోజులపాటు సమావేశాలు జరపాలని నిర్ణయించారు. అయితే ప్రతిపక్షం కోరితే సమావేశాలు పొడిగిస్తామని ప్రభుత్వం ప్రకటించుకుంది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, విత్తనాల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు, టీడీపీ ఎమ్మెల్యేలకు జరుగుతున్న అవమానంపై శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయించుకుంది. మొత్తం 23 అంశాలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో వైసీపీ శాసనసభాపక్షం కోరింది.

తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వివిధ అంశాలపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించడంతో ఈ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలతో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలుగుదేశం ఆరోపిస్తోంది. దీనిపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని ఆ పార్టీ నిర్ణయించింది. విత్తనాల కొరత, కరువు పరిస్థితులపై కూడా తెలుగుదేశం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఎవరెవరు ఏ అంశాలపై మాట్లాడాలో, శాసనమండలిలో వ్యవహారించాల్సిన తీరుపై కూడా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అటు శాసనసభ్యులకు, ఇటు ఎమ్మెల్సీలకు ఇప్పటికే దిశానిర్ధేశం చేశారు. శాసనసభలో తెలుగుదేశం పార్టీని, ప్రతిపక్ష నేత చంద్రబాబును కార్నర్ చేయడానికి వైసీపీ ఏ అవకాశమూ వదిలి పెట్టదు.

పన్నెండో తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత అంశాల వారీగా శ్వేతపత్రాలను అసెంబ్లీ సాక్షిగా విడుదల చేయనుంది ప్రభుత్వం. ఆర్థిక రంగంపై బుగ్గన శ్వేతపత్రం.. చూస్తే.. కచ్చితంగా.. టీడీపీ పాలనా వైఫల్యాలను ఎండగట్టే విధంగా ఉంటాయన్న విషయం మాత్రం క్లారిటీ ఉంటుంది. వీటిని ఎదుర్కోవడానికి వీలైతే.. అసెంబ్లీలో… లేకపోతే.. బయట… నిజమైన అంకెలను బయట పెట్టాలని టీడీపీ నేతలు… ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మొత్తానికి.. ఏపీ అసెంబ్లీలో.. పోరాటానికి మాత్రం కొదువ ఉండదు. రాజకీయం వెల్లువలా సాగడం ఖాయంగానే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : గుర్తుకొస్తున్నావయ్యా.. శేషన్ !

టీ.ఎన్.శేషన్. ఈ పేరు భారత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్మరించుకుంటూనే ఉన్నారు. గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆయనను మరిపించేలా మాత్రం ఎవరూ రావడం లేదు. ఎన్నికల సంఘం...

నిప్పుల కుంపటిలా తెలంగాణ..

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ...

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close