కలెక్టర్ల చేతిలోనే మున్సిపల్ చైర్మన్‌ల జుట్టు..!

తెలంగాణ కొత్త మున్సిపల్ చట్టంలో అనూహ్యమైన విషయాలు ఉన్నాయి. మున్సిపల్ చైర్మన్‌లు అక్రమాలకు పాల్పడితే సస్పెన్షన్ వేటు వేసే అధికారాన్ని కొత్త చట్టం…కలెక్టర్లకు కల్పిస్తోంది. మున్సిపల్ చట్టం 1965, మున్సిపల్ చట్టం 1994 స్థానంలో కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ మినహా.. మొత్తంగా 128 మున్సిపాలిటీలు. , 12 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి.

15 రోజుల్లోనే ఎన్నికలు పూర్తి ..!

మున్సిపల్ ఎన్నికలను పదిహేను రోజల్లో పూర్తి చేసేలా నిబంధనలు మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు. ఎన్నికల నిర్వహణకు కాలవ్యవధిని కుదించారు. పదిహేను రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ ముగిసేలా బిల్లులో ప్రతిపాదించారు..నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి పదిహేనవ రోజున పోలింగ్ నిర్వహించనున్నారు.. కౌంటింగ్ ఎప్పుడు నిర్వహించాలనేది మాత్రం ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. అంటే రెండు వారాల్లో ప్రక్రియ ముగిసిపోతుంది. గతంలో..వరంగల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించినప్పుడు కూడా ఇంతే వేగంగా ప్రక్రియ పూర్తి చేశారు.

కావాలంటే చైర్మన్లను సర్కార్ తొలగించవచ్చు..!

ప్రజలు ఎన్నుకున్నప్పటికీ.. కొత్త చట్టంలో… మున్సిపల్ చైర్మన్లకు విశేషాధికారులు లేవు. సస్పెన్షన్ విధించడానికి కలెక్టర్‌కు… అసలు తొలగించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకమైన, అత్యవసరమైన అధికారాలు కల్పించారు. అక్రమాలకు పాల్పడే ఛైర్మన్లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగించారు. వీరిపై ఆరోపణలు రుజువైతే పూర్తిగా తొలగించే అధికారం ప్రభుత్వానిదేనని కొత్త బిల్లులో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలతో.. ఇక .. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు.. గెలిచినా… చైర్మన్ పీఠంలో ఉండాలంటే… ప్రభుత్వానికి అణిగిమణిగి ఉండాల్సిందే.

చైర్మన్లకు బోలెడన్ని బాధ్యతలు..!

మున్సిపల్ చైర్మన్లకు.. చట్టం చాలా బాధ్యతలు అప్పగిస్తోంది. ప్రతి నెలా మున్సిపల్ సమావేశాలు ఏర్పాటు చేయడమే కాదు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, చెత్త సేకరణ విషయాల్లో బాధ్యతలు నిర్ణయించారు. ప్రతీ మున్సిపాలిటీలో గ్రీన్ సెల్ ఏర్పాటు చేసి బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు. మొక్కలు నాటడం, నర్సరీలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. పార్క్ ల అభివృద్ధి, నిర్వహణ, నీటి వనరుల సంరక్షణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు చేపట్టాలని బిల్లులో పొందుపరిచారు. బోర్ ల వాడకం తగ్గింపు, వర్షపు నీటిని ఒడిసి పట్టే విధానలు తప్పని సరి చేయాలని బిల్లులో పేర్కొన్నారు..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close