స్థానికుల‌కే 75 శాతం ఉద్యోగాలు… నైపుణ్యాల మాటేంటి..?

ఎన్నిక‌ల ముందు ఇచ్చిన మ‌రో కీల‌క హామీల‌పై నిర్ణ‌యం ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికుల‌కు 75 శాతం కోటా క‌ల్పించారు. ఇది క‌చ్చితంగా మంచి నిర్ణ‌య‌మే. ఎందుకంటే, స్థానికంగా ప‌రిశ్ర‌మ‌లు ఉండి… ఉపాధి కోసం యువత వ‌ల‌స‌లు పోయే పరిస్థితికి కొంత‌వ‌ర‌కూ చెక్ ప‌డుతుంది. అలాగే, ప‌రిశ్ర‌మ‌ల రాక కార‌ణంగా భూములు కోల్పోయిన‌వారు కూడా త‌మ వారికి స్థానికంగానే ఉపాధి ద‌క్కుతుంద‌నే ఆనందం కూడా ఉంటుంది. అయితే, ఈ నిర్ణ‌యాన్ని స‌క్ర‌మంగా అమ‌లు చేసి, దీని ద్వారా పూర్తిస్థాయిలో ల‌బ్ధి అంద‌రికీ ద‌క్కాలంటే… ప్ర‌భుత్వం మ‌రికొన్ని కీల‌క అంశాల‌పై కూడా క‌చ్చితంగా దృష్టి సారించాల్సి ఉంటుంది.

ప‌రిశ్ర‌మ‌ల్లో ఆయా ప్రాంతాల‌కు చెందిన‌వారికే 75 శాతం ఉద్యోగాలు అన్నారు బాగుంది! కానీ, ఆ ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన అర్హ‌త‌ల‌ను స్థానికుల్లో పెంచే దిశ‌గా కూడా ప్ర‌భుత్వ‌మే చొర‌వ తీసుకోవాలి. అంటే, స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ లాంటి కార్య‌క్ర‌మాలు. స్కిల్ ఉన్న మేన్ ప‌వ‌ర్ గ్రామీణ ప్రాంతాల్లోనే ల‌భిస్తే ఏ కంపెనీలైనా హాయిగా తీసుకుంటాయి. అయితే, ఇక్క‌డ స‌మ‌స్యంతా నైపుణ్యాల ద‌గ్గ‌రే వ‌స్తోంది. ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా 75 శాతం ఉద్యోగాలు వారికే ఇవ్వాలంటే… అదే స్థాయిలో స్థానికుల్లో నైపుణ్యాలు పెంచే బాధ్య‌త కూడా ప్ర‌భుత్వ‌మే తీసుకోవాలి. లేదా, ఆయా కంపెనీలకే స్థానికుల‌కు స్కిల్స్ పెంచే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేలా ఆదేశించాలి. ఉదాహ‌ర‌ణ‌కు హైద‌రాబాద్ తీసుకుంటే… ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు ఉన్న‌ప్పుడు ఎన్నో సాఫ్ట్ వేర్ కంపెనీలు వ‌చ్చాయి. కానీ, ఆయా కంపెనీల్లో స్థానికుల కంటే ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన‌వారే ఎక్కువ‌గా ఉన్నారు.

ప్రైవేటు సంస్థ‌ల‌కు స్కిల్ ఒక్క‌టే ముఖ్యం. ఉద్యోగాలు స్థానికుల‌కు ఇస్తున్నామా, ఇత‌రుల‌కు ఇస్తున్నామ‌నే అనే ప్రాథ‌మ్యం వారికి ఉండ‌దు. ఇది ప్ర‌భుత్వ నిర్ణ‌యం కాబ‌ట్టి, ఇది ప‌క్కాగా అమ‌లు జ‌రిగితే… గ్రామీణ ప్రాంతాలు బాగుప‌డే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి, నైపుణ్యాల పెంపుద‌ల‌పై కూడా ప్ర‌భుత్వ‌మే చొర‌వ తీసుకోవాలి. నిజానికి, ఈ నిర్ణ‌యం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌క ముందే… అధికారుల నుంచి కొన్ని అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైన‌ట్టు స‌మాచారం! గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యాల ల‌భ్య‌త‌, ఈ 75 శాతం నిబంధ‌న‌ల‌కు ప్రైవేటు సంస్థ‌లు ఒప్పుకుని ముందుకొస్తాయా… ఇలాంటి కొన్ని అంశాల‌పై మ‌రింత అధ్య‌య‌నం చేయాల‌ని అధికార వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డ్డాయ‌ని స‌మ‌చారం. కానీ, ఎలాగైనా అమ‌లు చేసి తీర్సాల్సిందే అదే వాద‌న నాయ‌కులు వినిపించార‌నీ కొంత‌మంది అధికారులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close