గోదావరికి జీవనది కళ వచ్చిందన్న కేసీఆర్..!

కాళేశ్వరం ప్రాజెక్టుతో.. గోదావరి నది జీవనదిలా మారిందని..కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తన మనసు పులకించి పోతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు పని చేస్తూండటంతో.. కేసీఆర్ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. ప్రాజెక్ట్ తిప్పిపోతల అంటూ… విపక్షాలు చేస్తున్న విమర్శలను..తనదైన వాగ్ధాటితోనే తిప్పికొట్టారు. కాళేశ్వరంలో రివర్స్‌ పంపింగ్‌ జరగడం లేదని.. వాటర్‌ లిఫ్టింగ్‌ మాత్రమే జరుగుతోందని తేల్చిచెప్పారు. 44 ఏళ్ల సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ రిపోర్టు ఆధారంగానే… కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌ చేశామని గుర్తు చేశారు. కాళేశ్వరం ద్వారా అదనంగా 400 టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకుంటున్నామని.. దీని ద్వారా.. 45 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. జూన్‌ నుంచి నవంబర్‌ వరకు నెలకు 60 టీఎంసీలు లిఫ్ట్‌ చేస్తామని .. నవంబర్‌ నుంచి జూన్‌ వరకు 40 టీఎంసీలు వాడుకుంటామన్నారు.

గోదావరి నుంచి 400 టీఎంసీలు ఎత్తిపోయడానికి… ఏడాదికి రూ.4,992 కోట్ల కరెంట్‌ బిల్లు చెల్లిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి బ్యారేజీ వరకు… ప్రతి రోజు 3 టీఎంసీల నీరు పంపింగ్ చేస్తున్నామని… 365 రోజులు ధర్మపురిలో గోదావరి జలాలు ఇలానే ఉంటాయన్నారు. కృష్ణాలో నీటి లభ్యత తక్కువగా ఉంది.. తెలంగాణకు గోదావరే గతి అని కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని.. సొంత నిధులతో ప్రాజెక్ట్‌లు పూర్తి చేసుకుంటున్నామని కేసీఆర్ ప్రకటించారు. కొన్ని రాజకీయ శక్తులు కుట్రలు పన్ని 300కి పైగా కేసులు వేశారని అన్నీ అధిగమించి ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తున్నామన్నారు.

ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణలో 1.20కోట్ల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇవన్నీ హామీలు కాదు, కళ్లముందు కన్పిస్తున్న వాస్తవాలని కేసీఆర్ ప్రకటించారు. ప్రాజెక్టులు ప్రారంభమైనా కరెంట్ సమస్య ఉండబోని..కేసీఆర్ స్పష్టం చేశారు. రామగుండం వద్ద నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రెడీ అవుతోందన్నారు. కరెంట్‌ సమస్య లేకుండా పోయిందని అన్ని రంగాలకు నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నామని గుర్తు చేశారు. అంతకు ముందు ధర్మపురి ఆలాయానికి వెళ్లిన కేసీఆర్.. ప్రత్యేక పూజలు చేశారు. ధర్మపురి పట్టాణాభివృద్ధికి రూ.10కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close