ఎంఐఎంకు తోడ్పాటుపై పోలీసులకు డైరెక్షన్స్‌ ఉన్నాయా?

దుర్ఘటనలు జరిగిపోయిన తర్వాత.. వాటిమీద పోస్టుమార్టం వలన ఉపయోగం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అలాంటి సమీక్ష చాలా అవసరం అవుతుంది. అలాంటిదే పాతబస్తీలో మజ్లిస్‌ గూండాలు తెగబడి చేసిన దాడుల వ్యవహారం కూడా! మజ్లిస్‌ నాయకులు, గూండాలు అందరూ కలిసి ఇతర పార్టీల అభ్యర్థులు, నాయకుల మీద దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం చేసిన సంఘటనలుగా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే దాడులకు దారితీసేందుకు కాకపోయినప్పటికీ.. ప్రత్యర్థి పార్టీల వారి కదలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎంఐఎం నాయకులు సమాచారం అందిస్తూ ఎన్నికల పోలింగ్‌ పర్వంలో వారు విచ్చలవిడిగా వ్యవహరించడానికి కొందరు పోలీసులే సహకరించారు.. వారికి ఏజంట్లుగా వ్యవహరించారు.. అనే ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

కొందరు పోలీసు అధికారులు, భద్రత ఏర్పాట్లలో ఉన్న సిబ్బంది స్వయంగా ఎంఐఎం తొత్తులుగా మారి ప్రత్యర్థి పార్టీల వారు ఎక్కడ సంచరిస్తున్నారో.. వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి వారు మిగిలిన చోట్ల రిగ్గింగులు చేసుకోవడానికి తోడ్పాటు అందించారని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి పాతబస్తీ పరిధిలో పోలీసులు అనుసరించిన వైఖరిని అటు ఎన్నికల సంఘం ఇటు రాష్ట్ర గవర్నరు కూడా తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ఆ నేపథ్యంలో గవర్నరు వద్ద చీవాట్లు తిన్న నగర కొత్వాల్‌ మహేందర్‌ రెడ్డి ఇక్కడి పోలీసు అధికారుల తీరు మీద గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. ఎన్నికల పర్వం ముగిసన తర్వాత ఈ ప్రాంతంనుంచి పలువురు పోలీసు అధికార్లకు బదిలీవేటు తప్పదని కూడా తెలుస్తున్నది.
డీసీపీని పక్కన పెట్టడం సిగ్గుచేటు కాదా?

పోలీసులు చాలా స్పష్టంగా ఎంఐఎంకు ఎన్నికల్లో సహకరించారేమో అని సామాన్యుడికి కూడా సందేహం కలిగే విధంగా ఎన్నికల సంఘం ఇవాళ జరుగుతున్న రీపోలింగ్‌కు సంబంధించి భద్రత ఏర్పాట్లలో పాల్గొనకుండా ఆ ప్రాంతపు డీసీపీ సత్యనారాయణ, అదనపు డీసీపీ బాబూరావును తప్పించారు. ఆ బాధ్యతలు మొత్తం జాయిట్‌ సీపీకి అప్పగించారు. పైగా కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఇలా ఎన్నికల సంఘం స్వయంగా అనుమానాలు వ్యక్తం చేసి ఒక ఉన్నతాధికారిని పక్కన పెట్టడం అనేది.. వ్యవస్థకు సిగ్గుచేటు కాదా అని పలువురు భావిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్‌ ఉన్నాయా?

ఎంఐఎం మా మిత్ర పక్షం అంటూ అదికార పార్టీ తెరాస ముందే ప్రకటించింది. దానికి తగినట్లుగానే ఎంఐఎం నాయకుల విషయంలో చూసీచూడనట్లు పోవాలని ముందుగానే పోలీసులకు ప్రభుత్వంలోని పెద్దలనుంచి డైరెక్షన్స్‌ ఉన్నాయా అని కూడా ఇప్పుడు పలువురికి సందేహాలు కలుగుతున్నాయి. మిత్రపక్షంగా వారిని మద్దతును కూడగట్టుకునేందుకు పోలీసుపరంగా హెల్ప్‌ అందించి ఉండవచ్చునని పుకార్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close