దేశభక్తి రాజకీయాలపై కేటీఆర్ ఆవేదన..!

భారతీయ జనతా పార్టీ దూకుడుపై.. తెలంగాణ రాష్ట్ర సమితి కౌంటర్ పాయింట్లు రెడీ చేసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో.. అసెంబ్లీ ఎన్నికల్లో పునాదులు కూడా లేని పార్టీ… పార్లమెంట్ కు వచ్చే సరికి.. సవాల్‌గా నిలిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దుతో… బీజేపీ ఇమేజ్ తెలంగాణలో అమాంతం పెరిగిపోయిందనే అభిప్రాయంతో ఆ పార్టీ నేతలు హడావుడి ప్రారంభించారు. దీంతో.. బీజేపీకి కౌంటర్ ఇవ్వక తప్పని పరిస్థితిలో టీఆర్ఎస్ అగ్రనేతలు పడిపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విధాన పరంగానే బీజేపీని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే.. తొలి సారి.. బీజేపీ మార్క్ రాజకీయాలపై.. ఓ తటస్థ వేదికపై.. తీవ్రంగా స్పందించారు. భారతీయ జనతా పార్టీ పేరు ప్రత్యక్షంగా చెప్పకపోయినా.. ఆ పార్టీనే తాను అంటున్నానని గుర్తించేలా వ్యాఖ్యలు చేశారు.

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ వికాస సమితి మూడవ రాష్ట్ర మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో.. కేటీఆర్ ప్రసంగించారు. ప్రజల విశ్వాసాలు, అభిప్రాయాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. తమతో నాతో ఉంటే దేశభక్తుడు.. కాకపోతే ఉంటే దేశద్రోహి అనే పరిస్థితులున్నాయని.. ఆవేద వ్యక్తం చేశారు. ప్రశ్నించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. తెలంగాణలో ప్రజలకు ఏదైనా మాట్లాడే..చర్చించే స్వేచ్ఛ ఉందని గుర్తు చేశారు. మతానికి భాష ఉండొచ్చు కానీ భాషకు మతం ఉండదన్నారు. తెలంగాణలో పరమత సహనం, అందర్నీ గౌరవించే సంప్రదాయం ఉందని… అయితే.. మత వైరుధ్యాలకు విలువలేని పరిస్థితి దేశంలో ఉందన్నారు. తాను ఇదంతా.. బీజేపీ గురించే చెబుతున్నానన్నట్లుగా.. మహాత్ముడినే అవమానించిన ప్రజ్ఞాసింగ్‌.. వ్యాఖ్యలను బీజేపీ సమర్థించడం బాధాకరమని కేటీఆర్‌ వ్యాఖ్యానించి.. తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పారు.

కశ్మీర్ విషయంలో.. బీజేపీని సమర్థించిన వాళ్లందర్నీ… ఓ రకంగా.. సమర్థించని వారిని మరో రకంగా బీజేపీ నేతలు టీజ్ చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై.. ఏ మాత్రం ప్రశ్నలు వేసినా.. వారిపై.. దేశద్రోహి ముద్ర వేస్తున్న పరిస్థితులు సోషల్ మీడియాలో ఉన్నాయంటున్నారు. ప్రజలపై ఇదో తరహా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగన్న అభిప్రాయం.. ఇతర పార్టీల నేతల్లో ఏర్పడుతోంది. దీన్ని తగ్గించడానికి కేటీఆర్..కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు...

ఓటేస్తున్నారా ? : ఏపీ రాజధానేదో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి !

పాలకుడు సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునేవాడు అయి ఉండకూడదు. సొంత ప్రజల్ని నాశనం చేసి తాను ఒక్కడినే సింహాసనంపై కూర్చుని అందర్నీ పీల్చి పిప్పి చేయాలనే వ్యక్తిత్వం ఉండకూడదు. అలా ఉంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close