టీఆర్ఎస్‌లో నామినేటెడ్ పోస్టుల్లేవ్..!

టీఆర్ఎస్ లో నామినేటెడ్ పోస్టులకు భారీగా డిమాండ్ ఉంది. దాదాపు ఐదారేళ్ళుగా త‌మ‌కు ఏదో ఒక పద‌వి కావాల‌ని పార్టీ ముఖ్యనేత‌లు, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేస్తున్నారు. ఉద్యమ‌కాలం నుంచి టీఆర్ఎస్ లో ఉన్న వారితో పాటు.. ఇత‌ర పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలు వెంట వ‌చ్చిన వారు చాలా మంది ప‌ద‌వులు ఆశిస్తున్నారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇస్తే కొంద‌రినే సంతృప్తి ప‌ర‌చ‌వ‌చ్చు.. ప‌ద‌వులు రాని అసంతృప్తులు బీజేపీ వైపు చూస్తే.. కింది స్థాయిలో పార్టీకి న‌ష్టం క‌లుగుతుంద‌నే భ‌యం టీఆర్ఎస్‌లో ప్రారంభమయింది.

టీఆర్ఎస్ నుంచి చాలా మంది బీజేపీలో చేర‌బోతున్నార‌ని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అమిత్ షా రాష్ట్రానికి రానుండ‌టంతో భారీగా చేరికలు ఉంటాయ‌ంటున్నారు. ప్రాధాన్యం దక్కని గులాబీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని… హైకమాండ్ కు కూడా సమాచారం అందింది. ఈ ప‌రిస్థితిల్లో నామినేటెడ్ ప‌ద‌వుల పంపిణీ చేస్తే.. అసంతృప్లులు బీజేపీ వైపు వెళ్తారని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే ప‌ద‌వీ కాలం ముగుస్తున్న కార్పొరేష‌న్ చైర్మన్లకు కూడా మ‌ళ్ళీ రెన్యువ‌ల్ చేయడం లేద‌ు. 2014 లో టీఆర్ఎస్ అధికారంలోనే వచ్చాక నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ విష‌యాన్ని లైట్ తీసుకున్నారు.

రెండో సారి అధికారంలోకి రాగానే వీల‌యినంత త్వర‌గా ప‌ద‌వులు పంపిణీ ఉంటుంద‌ని నేత‌లు ఆశించారు. త‌ర్వాత వ‌రుస‌గా ఎన్నిక‌లు రావ‌టంతో అధిష్టానం ఈ ప‌ద‌వుల భ‌ర్తీని ప‌క్కన పెట్టేసింది. ఇక త్వర‌లోనే నామినేటెడ్ పోస్టులు భ‌ర్తీ అవుతాయ‌ని భావించిన నేత‌ల‌కు బీజేపీ గండం ఎదురొచ్చింది. దీంతో గులాబీ పార్టీలో ద్వితీయ‌శ్రేణి నాయ‌క‌త్వం అసంతృప్తికి గుర‌వుతోంది. ఈ అసంతృప్తి కన్నా.. ఒకరికి పదవి దక్కి… మరొకరికి దక్కకపోతే.. వచ్చే అసంతృప్తినే ఎక్కువ చేటు చేస్తుందని.. టీఆర్ఎస్ వర్గాలు అంచనాకు వచ్చాయి. అందుకే.. బీజేపీ బూచి… టీఆర్ఎస్ నేతలకు పదవుల్ని దూరం చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close