‘సైరా’కి వీఎఫ్ఎక్స్ టెన్ష‌న్‌

విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో సినిమా అనేస‌రికి స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు. ముఖ్యంగా విడుద‌ల తేదీ ప‌క్కాగా నిర్ణ‌యించ‌లేం. రిలీజ్ డేట్ అనేది విజువ‌ల్ ఎఫెక్ట్స్ చేస్తున్న కంపెనీల చేతుల్లోనే ఉంటుంది. వాళ్లు ఫైన‌ల్ అవుట్ పుట్ ఇచ్చేంత వ‌ర‌కూ న‌మ్మలేం. ఇది వ‌ర‌కు ‘రోబో 2.ఓ’ లాంటి సినిమాలు ఆల‌స్యం అవ్వ‌డానికి కార‌ణం.. ఇదే. ఇప్పుడు `సైరా`కీ ఈ టెన్ష‌న్ ప‌ట్టుకుంది.

దాదాపు 26 స్డూడియోల‌లో ‘సైరా`’వీఎఫ్ఎక్స్ ప‌నులు సాగుతున్నాయి. ఇందులో ఒక్క స్టూడియో.. డుమ్మా కొట్టినా రిలీజ్‌డేట్ విష‌యంలో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. అక్టోబ‌రు 2న ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం ప్లాన్ చేసింది. రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించేసింది. అయితే.. అప్ప‌టికి వీఎఫ్ఎక్స్ ప‌నులు అవుతాయా? లేదా? అనే టెన్ష‌న్ మాత్రం సైరా టీమ్‌కి చాలానే ఉంది. అందుకే వీఎఫ్ఎక్స్ విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ప్ర‌తీ స్డూడియోకి ఇచ్చిన ప‌ని ఎంత‌? రోజువారీగా వాళ్లు చేస్తున్న వ‌ర్క్ ఎంత‌? అనే విష‌యం ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లు వేసేసుకుంటున్నారు. త‌ద్వారా ఎవ‌రైనా వ‌ర్క్ విష‌యంలో స్లోగా ఉంటే, ఆ కంపెనీకి ఇచ్చిన అవుట్ పుట్ మ‌రో కంపెనీకి అప్ప‌గించే వెసులుబాటు ఉంటుంది. వీఎఫ్ఎక్స్ లో ఎంత చేసినా సంతృప్తి ఉండ‌దు. చివ‌రి వ‌ర‌కూ మార్పులూ చేర్పులూ ఉంటాయి. కాక‌పోతే మ‌రీ స‌న్నివేశాల్ని చెక్క‌కుండా, చేసిందే చేయ‌కుండా.. ఓ డెడ్‌లైన్ పెట్టుకుని, ఆలోగా ప‌నులన్నీ పూర్తి చేయాల‌ని నియ‌మంగా పెట్టుకున్నారు. వీఎఎఫ్ఎక్స్ ల ప‌ని ఎంత వ‌ర‌కూ వ‌చ్చింది? అనే విష‌యాన్ని ఆరా తీయ‌డానికే ఓ టీమ్‌ని ప్ర‌త్యేకంగా నియ‌మించింది సైరా బృందం. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, ఏమైనా అనుకోని అవాంత‌రం ఎదురై, విడుద‌ల తేదీ మార్చాల్సి వ‌స్తే ఏమిట‌న్న విష‌యంలోనూ చిరు బృందం ప్లాన్ బి సిద్ధం చేసుకుంది.కానీ ఆ అవ‌స‌రం రాకుండా ఉండాల‌ని చిత్ర‌బృందం క‌ష్ట‌ప‌డుతోంది. వీఎఫ్ఎక్స్‌తో పెట్టుకుంటే… ఇన్ని క‌ష్టాలు అనుభ‌వించాల్సిందే మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close