చరిత్రలో నిలిచిపోయే ఆరడుగుల రాకెట్ “సింధు”..!

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌ను.. పీవీ సింధు.. గెలుచుకుంది. తన కెరీర్‌లో.. అత్యున్నత .. చాంపియన్ షిప్ సాధించాలన్న లక్ష్యంతో వరుసగా.. గత మూడేళ్లుగా చేస్తున్న దండయాత్రలో రెండు సార్లు విఫలమైనప్పటికీ.. మూడో సారి.. సంచలన విజయం నమోదు చేసింది. చరిత్రలో చెరుపని విధంగా తన పేరును లిఖించుకుంది. సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ షిప్ సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఫైనల్‌లో.. జపాన్ షట్లర్ నజోమి ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో.. వరుస సెట్లలో గెలిచి.. తన రాకెట్ పవర్‌ను చాటింది.

చాంపియన్ షిప్ కోసం దండయాత్ర.. ! ఎట్టకేలకు సక్సెస్..!

పీవీ సింధు పోరాటం.. అసాధారణం. వరుసగా ఈ సారి మూడో ఏడాది.. ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్స్ కు చేరింది. కానీ… ఈ ఏడాదే విజయం సాధించింది. గత రెండేళ్లుగా.. ఫైనల్‌ దాకా వెళ్లింది. కానీ చాంపియన్ అవలేకపోయింది. కానీ ఆమె ఎక్కడా నీరు కారిపోలేదు. ఓటమి గెలుపునకు నాంది అనుకుంది. కఠోర శ్రమ సాధించింది. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరి సత్తా చాటిన సింధు ఫైనల్ లో ఒకహురాపై విజయం సాధించి 2017 ఫైనల్ లో తనకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 2017లో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ పోటీలో ఒకహురాతో తలపడిన సింధు మూడు సెట్ల పాటు హోరాహోరీగా తలపడింది. రెండు గంటల పాటు జరిగిన నాటి ఫైనల్ లో సింధు తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. కానీ ఇప్పుడు అదే ఒకుహరాపై…. తిరుగులేని ఆధిపత్యంతో విజయం సాధించింది. గత ఏడాది కరోలినా మారిన్ చేతిలో పరాజయం పాలైంది. ఈ సారి ఎవరికీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

బ్యాడ్మింటన్ దిగ్గజాలందరిలోకల్లా.. సింధునే టాప్..!

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో .. ప్రకాష్ పదుకొనే.. గోపీచంద్.. సైనా నెహ్వాల్ లాంటి.. ప్లేయర్లు.. చరిత్ర సృష్టించారు కానీ.. ఎవరూ… ప్రపంచ చాంపియన్ షిప్ దగ్గరకు వెళ్లలేకపోయారు. ఒక్క మేల్ ప్లేయర్ కూడా.. వరల్డ్ చాంపియన్ కాలేకపోయారు. కానీ.. ఆ రికార్డును సింధును కొట్టేసింది. ఆమె…భారత దేశ చరిత్రలోనే… బ్యాడ్మింటన్‌లో ప్రపంచ విజేతగా నిలిచిన మొదటి ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు.

కఠోరశ్రమ.. అంకిత భావానికి ప్రతీక సింధు..!

సింధుకు ఈ విజయం సునాయాసంగా రాలేదు. అవకాశాన్ని ఆయుధంగా మల్చుకుంది.. కొరియా కోటలను బద్దలుకొట్టింది. చైనీస్ ప్లేయర్లను మట్టి కరిపించింది. ఆత్మవిశ్వాసాన్ని ఆలంబనగా చేసుకుంది. తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు బ్యాడ్మింటన్‌ చరిత్ర లిఖించింది. ఎత్తిపట్టిన రాకెట్‌తో ఎదురెళ్లి ప్రతీకారం తీర్చుకుంది. బరిలోకి దిగిన ప్రతిసారి ఏదో అడ్డంకితో దూరమైపోయిన టైటిల్‌ను రెండు చేతులతో ఒడిసిపట్టుకుంటూ భారత సింధూరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close