డార్లింగ్ లుక్ ఇలా ఉందేంటి?

టాలీవుడ్ లోనే కాదు, మొత్తం ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్ర‌భాస్‌. త‌న అభిమానుల్లో అమ్మాయిల వాటా కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. బాహుబ‌లి త‌ర‌వాతైతే లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా బాగా పెరిగిపోయింది. పైగా ఆర‌డ‌గుల అంద‌గాడు. మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌, మిర్చి, డార్లింగ్‌.. ఇలాంటి సినిమాల్లో ప్ర‌భాస్ లుక్ అదిరిపోయింది.

అయితే సాహోలో ప్ర‌భాస్ లుక్ చాలా తేడాగా క‌నిపించింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌లో ఏదో మేనేజ్ చేయ‌గ‌లిగారు గానీ… సినిమాలో మాత్రం ప్ర‌భాస్ లుక్ మైన‌స్‌గా మారింది. ప్ర‌భాస్ డైహార్డ్ ఫ్యాన్స్‌కి సైతం ప్ర‌భాస్ లుక్ ఈ సినిమాలో న‌చ్చ‌లేదు. ప్ర‌భాస్ స్టైలింగ్ కోసం చిత్ర‌బృందం చాలా క‌ష్ట‌ప‌డింది, ఎంతో ఖ‌ర్చు పెట్టింది. ముంబై నుంచి పేరున్నవాళ్ల‌ని రంగంలోకి దింపింది. అయితే.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. ప్ర‌భాస్ ట్రిమ్ షేవ్ మ‌రింత దెబ్బ‌కొట్టింది. పాట‌ల్లో త‌న డ్రెస్సింగ్ సెన్స్ బాగున్నా – మిగిలిన సన్నివేశాల్లో మాత్రం తేలిపోయింది. ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. అలాంట‌ప్పుడు స్టైలింగ్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అత‌ని హెయిర్ స్టైల్ కూడా ఒక్కో స‌మ‌యంలో ఒక్కోలా క‌నిపించింది. ఇదంతా కేర్ లెస్‌గా జ‌రిపోయిన వ్య‌వ‌హారాలా? లేదంటే దాన్నే కొత్త‌ద‌నం అనుకున్నారా? అనేది చిత్ర‌బృందానికే తెలియాలి. ఏదైతేనేం.. లుక్ విష‌యంలో ప్ర‌భాస్ జాగ్ర‌త్త‌గా ఉండాలన్న సంకేతాల్ని సాహో పంపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close