ఢిల్లీలో విజయసాయిరెడ్డిని దూరం పెట్టిన బీజేపీ..!

తెలంగాణ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను.. ఏపీకి తీసుకు వచ్చి.. ఇంటలిజెన్స్ చీఫ్ పోస్టు ఇద్దామనుకున్నారు జగన్. స్టీఫెన్ రవీంద్ర వైఎస్ జగన్ ఫ్యాన్ అన్న ప్రచారం ఉంది. ఆయన వచ్చి అనధికారికంగా విధులు కూడా నిర్వహించారని చెప్పుకొన్నారు. ఢిల్లీ సర్కార్ తో జగన్ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు.. విజయసాయిరెడ్డి లాబీయింగ్ సామర్థ్యం అన్నీ చూసి… స్టీఫెన్ డిప్యూటేషన్ లాంఛనమే అనుకున్నారు. కానీ… చివరికి కేంద్రం నిరాకరించిందనే వార్తను చూసి.. రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో.. తమకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డికి.. ప్రధానమంత్రి కార్యాలయం రెడ్ కార్పెట్ పరుస్తుందని. గొప్పలు చెబుతూ ఉంటారు.

ప్రధాని మోదీ కూడా.. ఓ సందర్భంలో.. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో … ” హల్లో..విజయ్ గారూ.. ” అంటూ విజయసాయిరెడ్డిని పలకరించి.. షేక్ హ్యాండివ్వడంతో.. తమ పలుకుబడికి ఎదురు లేదనే భావనకు వచ్చారు. అయితే.. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. ఓ ఐపీఎస్ అధికారిని డిప్యూటేషన్ పై .. ఏపీకి తెచ్చుకోలేకపోయారు. నాన్చి..నాన్చి.. చివరకు స్టీఫెన్ రవీంద్రకు కేంద్రం నో చెప్పింది. శ్రీలక్ష్మీ విషయం ఎటూ తేల్చకపోయినా పెండింగ్ లో పెట్టారంటే..తిరస్కరించడమేనని అంటున్నారు. కేంద్రం వద్ద చాలా పలుకుబడి ఉందనుకున్న వైసీపీ నేతలకు ఈ వ్యవహారం మింగుడు పడటం లేదు. చివరికి జగన్ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడమే వైసీపీని బాధిస్తోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా ప్లాన్డ్ గా … తమ వైఫల్యాల్ని బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం ఢిల్లీ నేతల్లో ఏర్పడినట్లుగా చెబుతున్నారు. తమ వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ.. అదే చనువుతో కేంద్రంతో రుద్దే ప్రయత్నాన్ని విజయసాయిరెడ్డి చేశారు. అన్ని నిర్ణయాలను… మోడీ, షాలకు చెప్పే చేస్తున్నామని.. వారి ఆశీస్సులు ఉన్నాయన్నట్లుగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో.. బీజేపీలోనే గగ్గోలు రేగింది. దీంతో వైసీపీని వీలైనంత దూరంగా పెట్టాలని బీజేపీ భావించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఫలితమే.. జగన్ అడిగిన అధికారుల్ని ఏపీకి పంపకపోవడం అనే ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి కార్యాలయం కూడా.. విజయసాయిరెడ్డి అపాయింట‌్మెంట్లను.. ఖరారు చేయడం లేదని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ నుంచి ఐ ప్యాక్ ప్యాకప్..!!

ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన ఐ ప్యాక్ టీమ్ ఏపీ నుంచి ప్యాకప్ చెప్పేసింది. ఉన్నట్టుండి మూడు వందల మంది ఉద్యోగులు వెళ్ళిపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల విజయవాడలోని ఐ ప్యాక్...

దక్షిణాదిపై మోదీ ఆశలు !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతీ విడత పోలింగ్ జరిగే ముందు మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఐదో విడత పోలింగ్ కు ముందు ఇచ్చిన ఇంటర్యూల్లో ఎక్కువగా దక్షిణాది గురించి చెప్పారు. దక్షిణాదిలో తాము...

‘ర‌ణ‌భాలీ’గా రౌడీ దేవ‌ర‌కొండ‌?

విజ‌య్ దేవ‌ర‌కొండ - రాహుల్ సంకృత్యాన్ కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం 'ర‌ణ‌భాలీ' అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదో పిరియాడిక్ యాక్ష‌న్ డ్రామా....

‘హ‌రోం హ‌ర‌’.. కాస్త ఆల‌స్యంగా!

ఈనెల 31న రావాల్సిన సినిమా 'హ‌రోం హ‌ర‌'. అయితే అదే రోజున నాలుగైదు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. అందుకే 'హ‌రోం హ‌ర‌' ఈ పోటీ నుంచి త‌ప్పుకొంది. జూన్ 14న వ‌స్తున్న‌ట్టు చిత్ర‌బృందం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close