సీఎం జ‌గ‌న్ ను తుగ్ల‌క్ అంటూ నారా లోకేష్ సెటైర్!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై మ‌రోసారి వ‌రుస ట్వీట్ల‌తో విమ‌ర్శ‌ల‌కు దిగారు మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కుడు నారా లోకేష్. అయ్యా… తుగ్ల‌క్ ముఖ్య‌మంత్రిగారూ అంటూ మొద‌లుపెట్టి… ఎడ‌మ కాలు విరిగితే ఎర్ర‌గ‌డ్డ మెంట‌ల్ హాస్పిట‌ల్లో క‌ట్టు క‌ట్టించిన‌ట్టుగా ఉంది మీ తెలివి అన్నారు. పోల‌వ‌రంలో త‌గ్గించి, ఎల‌క్ట్రిక్ బ‌స్సుల్లో ప‌దిరెట్లు పెంచిన మీ లాజిక్, రివ‌ర్స్ టెండ‌రింగ్ లోప‌లున్న అస‌లైన మేజిక్ ని సామాన్య ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేట్టు చేస్తోంద‌ని విమ‌ర్శించారు. పోల‌వ‌రం బ‌హుళార్థ సార్థ‌క ప్రాజెక్ట్ అనీ, దాన్ని కేవ‌లం రాజ‌కీయ స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ఎలాంటి అనుభ‌వం లేని కంపెనీకి అప్ప‌గించ‌డం స‌రైంది కాద‌న్నారు. అది ప్రాజెక్టు ఉనికికే ప్ర‌మాద‌మ‌న్నారు. రివ‌ర్స్ టెండ‌రింగ్ వ‌ల్ల పోల‌వ‌రం ప్రాజెక్టు మీదికి చైనా మేఘాలు క‌మ్ముకుంటున్నాయ‌న్నారు.

మ‌రో ట్వీట్లో లోకేష్ స్పందిస్తూ… ప్ర‌కాశం బేరేజీకి అడ్డంగా ప‌డున్న ఒక బోటును తీసేందుకు మీకు ఓ వారం రోజులు ప‌ట్టింద‌నీ, గోదావ‌రిలో బోటు మునిగితే రెండు వారాలైనా తీయ‌లేక‌పోయార‌నీ, సెక్ష‌న్ 144 పెట్టార‌న్నారు. 70 శాతం పూర్తయిన పోల‌వ‌రం ప్రాజెక్టుని, 30 శాతం పూర్తి చేస్తామంటూ స‌వాలు చేయ‌డం మంత్రిగారికి అల‌వాటైన విద్యేమో, అందుకే పోల‌వ‌రం మీద కూడా బెట్టింగులు కాద్దామంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఓ మూడురోజుల కింద‌ట.. ఇప్ప‌టికైనా నోరు తెర‌వండి ముఖ్య‌మంత్రిగారూ అంటూ గ్రామ స‌చివాల‌య ప‌రీక్ష పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంపై నేరుగా స్పందించారు. ఇప్పుడు ఏకంగా తుగ్ల‌క్ సీఎం అంటూ ఆరోపిస్తున్నారు నారా లోకేష్.

ప్ర‌తిపక్ష పార్టీగా టీడీపీ త‌ర‌ఫున ధీటైన ప్ర‌శ్న‌లూ విమ‌ర్శ‌లే నారా లోకేష్ చేస్తున్నా… వీటిపై అధికార పార్టీ నుంచి స్ప‌ష్ట‌మైన స్పంద‌న ఉండ‌టం లేదు. ఇప్పుడీ పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్ విష‌యంలోగానీ, గోదావ‌రిలో బోటు ప్ర‌మాదం అంశంలోగానీ, గ్రామ స‌చివాల‌య పేప‌ర్ల లీకేజీ వ్య‌వ‌హారంలోగానీ… ప్ర‌భుత్వం నుంచి ప్ర‌జ‌ల‌కు ఇంకా స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే, అనుమానాలు అలానే వ‌దిలేసి, తాము చేస్తున్న ప్ర‌క్రియే గొప్ప‌దీ అనుస‌రిస్తున్న విధానాలే అద్భుత‌మైన‌వీ అనే ధోర‌ణిలో మంత్రులు మాట్లాడుకుంటూ పోతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష పార్టీ నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌లూ ఆరోప‌ణ‌ల‌ను కూడా అధికార పార్టీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని స్పందించాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close