జగన్‌ను వదిలి పెట్టని కేంద్ర విద్యుత్ మంత్రి..! ఈ సారి మరింత ఘాటు లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ వదిలి పెట్టడం లేదు. పీపీఏల విషయంలో జగన్ వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్న ఆయన.. బహిరంగంగా.. కూడా విమర్శలు చేశారు. మరో సారి.. నేరుగా జగన్‌కే లేఖ రాశారు. చంద్రబాబు హయాంలో పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లలో అవినీతి జరిగిందంటూ… ప్రధానమంత్రికి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ లేఖ ఇచ్చారు. ఆ లేఖ విషయంపై.. ఆర్కేసింగ్.. జగన్ కు రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అధిక టారిఫ్‌లకు పీపీఏలతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకుని కమిషన్లు తీసుకున్నారనేది.. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. దీనిపై లేఖలో ఆర్కేసింగ్ సూటిగా… స్పందించారు. డిస్కంల నష్టానికి అధిక టారిఫ్‌ కారణం కానే కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇతర కారణాల వల్లే డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని తేల్చి చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో పీపీఏలకు ఇంతకంటే అధిక ధరలు చెల్లిస్తున్నారని లెక్కలతో సహా గుర్తు చేశారు.

పీపీఏల టారిఫ్‌ల నిర్ణయం గాలివేగం, సౌర థార్మికత… ప్లాంట్‌ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని జగన్ కు.. ఆర్కేసింగ్ మరోసారి గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం మూడు కంపెనీలకే 70శాతం కేటాయింపులు చేశారన్న వాదనల్లో నిజంలేదని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని కంపెనీలు మిగతా కంపెనీలను… టేకోవర్‌ చేయడం వల్లే విద్యుత్‌ ఉత్పాదకత పెంచుకున్నాయని .. ఇందులో ప్రభుత్వానికి ఏంటి సంబంధమని… ప్రశ్నించారు. ధర్మల్ పవర్ ప్రస్తుతం… రూ.4.20పైసలకే నేడు వస్తోందని.. అయినా ఎక్కువ ధర పెట్టి.. సంప్రదాయేతర విద్యుత్ కొన్నారన్న జగన్ ఆరోపణలపైనా.. ఆర్కే సింగ్ సూటిగా సమాధానం చెప్పారు. ఇప్పుడు రూ. .4.20కే రావొచ్చు కానీ.. 20 సంవత్సరాల తర్వాత యూనిట్‌ రూ. 22 అవుతుందన్నారు.

పవన విద్యుత్‌ ఎప్పుడూ రూ.4.80కే లభిస్తుందని గుర్తు చేశారు. పీపీఏల పునఃసమీక్ష, చేస్తున్న ఆరోపణలు… సాంప్రదాయేతర విద్యుత్‌ రంగాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆర్కేసింగ్ .. ఏపీ ముఖ్యమంత్రిని మరోసారి హెచ్చరించారు. ఓ వైపు హైకోర్టు తీర్పు.. మరో వైపు కేంద్రం లేఖతో.. పీపీఏల సమీక్ష విషయంలో ఏపీ సర్కార్ ముందడుగు వేయలేని పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close