సెంచ‌రీ సినిమాల కోసం చూస్తున్న‌ రామోజీ

ఉషాకిర‌ణ్ మూవీస్ సంస్థ నుంచి ఎన్నో మ‌ర‌పురాని సినిమాలొచ్చాయి. హృద్య‌మైన క‌థ‌ల‌కు ఆ సంస్థ పెట్టింది పేరు. యువ ద‌ర్శ‌కుల‌కూ అవ‌కాశాలిచ్చి, వారి ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. అయితే కొన్నాళ్లుగా ఉషాకిర‌ణ్ నుంచి సినిమాలు రావ‌డం లేదు. మిగిలిన వ్యాపారాల్లో క‌నిపించే `లాభం` సినిమాల్లో లేక‌పోయేస‌రికి మెల్ల‌మెల్ల‌గా సినీ నిర్మాణం త‌గ్గించుకుంది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ… ఉషాకిర‌ణ్ మూవీస్ యాక్టీవ్ అవుతున్న‌ట్టు టాక్‌. ఉషాకిర‌ణ్ మూవీస్ సంస్థ కొన్ని క‌థ‌లు సిద్ధం చేసింద‌ని టాక్‌. ఉషాకిర‌ణ్ ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 85 సినిమాల్ని రూపొందించింది. మ‌రో 15 తీస్తే వంద సినిమాలు తెర‌కెక్కించిన ఘ‌న‌త ద‌క్కుతుంది. అందుకే… ఆ మైలు రాయి కోస‌మైనా సినిమాలు చేయాల‌ని రామోజీరావు భావిస్తున్నారట. అలాగ‌ని ఏ క‌థ‌లు ప‌డితే, ఆ క‌థ‌ల్ని ఎంచుకోకుండా, ఉషాకిర‌ణ్ గ‌త వైభ‌వాన్ని గుర్తుకు తెచ్చేలా సినిమాల్ని రూపొందించాల‌ని భావిస్తున్నారట.

ఉషాకిర‌ణ్ ద‌గ్గ‌ర కొన్ని క‌థ‌లు సిద్ధ‌మ‌య్యాయి కూడా. ఆ క‌థ‌ల్ని యువ‌త‌రం ద‌ర్శ‌కుల‌తో తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు చేస్తోంది. తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన కొంత‌మంది ద‌ర్శ‌కులకు ఉషాకిర‌ణ్ మూవీస్ నుంచి పిలుపొచ్చింది. కొంత‌మందికి అడ్వాన్సులూ అందాయి. ఈ సినిమాల‌కు రామోజీ రావు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ అందింద‌ని స‌మాచారం. ఉషాకిర‌ణ్ మూవీస్‌కి ఓ స్టోరీ బోర్డ్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. అది కొంత‌కాలంగా కొత్త‌క‌థ‌ల్ని విన‌డం లేదు. ఇప్పుడు మ‌ళ్లీ కొత్త క‌థ‌లు విన‌డం మొద‌లెట్టింది. 2020 నుంచి ఉషాకిర‌ణ్ నుంచి యేడాదికి క‌నీసం 3 సినిమాలు వ‌చ్చేలా ప్ర‌ణాళిక‌లు రూపొందుతున్నాయి. ఉషాకిర‌ణ్‌కి కావ‌ల్సినంత ఇన్‌ఫ్రాస్ట‌క్చ‌ర్ ఉంది. స్డూడియోలు, ల్యాబ్‌లు ఉన్నాయి. మంచి క‌థ‌లు దొరికితే చాలు. ప్ర‌స్తుతం ఉషాకిర‌ణ్ ఫోక‌స్ అంతా వాటిపైనే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close