మ‌హేష్ క‌థ‌… ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు

గీత గోవిందం లాంటి సూప‌ర్ హిట్ సినిమా తీసిన త‌ర‌వాత కూడా ప‌ర‌శురామ్‌కి గ్యాప్ వ‌చ్చేసింది. మ‌హేష్‌బాబుకి క‌థ చెప్పి, ఓకేచేయించుకున్నా లాభం లేక‌పోయింది. మ‌హేష్ చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉండ‌డంతో.. ప‌ర‌శురామ్ వెయిటింగ్ లిస్టులోకి చేరిపోయాడు. మ‌హేష్ కి క‌థ న‌చ్చినా, వెంట‌నే ప‌ర‌శురామ్‌కి డేట్లు ఇవ్వ‌డానికి సిద్ధంగా లేడు. దాంతో.. ప‌ర‌శురామ్ మ‌హేష్ పై ఆశ‌లు వ‌దులుకున్నాడు. ఇదే క‌థ‌ని.. ఎన్టీఆర్‌ని వినిపించ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని టాక్‌. ఎన్టీఆర్ ఓకే అంటే, త‌న కోసం వెయిట్ చేయ‌డానికి సైతం ప‌ర‌శురామ్ సిద్ధం అన్నాడ‌ట‌. ఎన్టీఆర్ `ఆర్‌.ఆర్‌.ఆర్‌`తో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర‌వాత అట్లీ, త్రివిక్ర‌మ్‌లు రెడీగా ఉన్నారు. అయితే.. ప‌ర‌శురామ్ క‌థ కొర‌టాల శివ‌కి బాగా న‌చ్చింద‌ట‌. త‌న స్నేహితుల‌నే నిర్మాత‌లుగా చేసి, ఈ సినిమా నిర్మించ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని టాక్‌. ప‌ర‌శురామ్ క‌థ వెనుక కొర‌టాల శివ ఉన్నాడంటే – ఎన్టీఆర్ త‌ప్ప‌కుండా ఈ ప్రాజెక్టుపై ప్ర‌త్యేక‌మైన దృష్టిసారిస్తాడు. ప‌ర‌శురామ్ న‌మ్మ‌కం కూడా అదే. స్టార్ హీరోల కోసం ప‌డిగాపులు కాస్తున్న ప‌ర‌శురామ్‌, ఓ మెట్టు దిగి యువ హీరోలతో స‌ర్దుకుపోతే త‌ప్ప‌, మ‌రుస‌టి సినిమా ప‌ట్టాలెక్కేలా క‌నిపించ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close