డీఎస్‌ ద్వారా డీల్‌ ఫైనలైజ్‌ చేసుకున్న దానం!

దానం నాగేందర్‌…తన అవసరానికి ఎన్నిసార్లు ఎన్ని పార్టీల్లోకి అయినా గెంతడానికి సిద్ధంగా ఉండే నాయకుడు ముద్ర పడిన సీనియర్‌ రాజకీయ వేత్త. గ్రేటర్‌ ఎన్నికలకు కొన్ని వారాల ముందు.. దానం ఇక తెరాసలో చేరిపోతున్నట్లే అని బీభత్సంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటికి దానికి పుల్‌స్టాప్‌ పడింది. మళ్లీ తాను పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌లో ఉంటా అంటూ ప్రతిజ్ఞలు చేసి.. అందరితో కలిసి మెలిసి తిరిగారు. కానీ ఇప్పుడు గ్రేటర్‌ ఫలితాలు వచ్చేసరికి దానం నాగేందర్‌కు దిమ్మతిరిగి క్లారిటీ వచ్చేసినట్లుంది. భవిష్యత్తులో కనీసం తనకు ఎమ్మెల్యేస్థానమైనా స్థిరంగా మిగలాలంటే.. తెరాసలోకి వెళ్లడం తప్ప గత్యంతరం లేదని అనుకుంటున్నట్లుగా.. కనిపిస్తోంది. అందుకే ఆయన తక్షణం తన గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. అయితే దీనికంటె ముందుగానే.. ఆయన తన రాజకీయ గురువు.. ప్రస్తుతం తెరాసలో ఒక మోస్తరుగా చక్రం తిప్పుతున్న నాయకుల్లో ఒకరైన డీ శ్రీనివాస్‌తో మంతనాలు పూర్తి చేసుకుని డీల్‌ మాట్లాడుకున్న తర్వాతనే.. ఇక్కడ రాజీనామా చేసినట్లుగా తెలుస్తున్నది.

నిజానికి దానం నాగేందర్‌ ఎన్నడో తెరాసలో చేరిపోయి ఉండాల్సింది. అప్పట్లో ఆయన చేరిక కూడా డీఎస్‌ ద్వారానే ఫైనలైజ్‌ అయింది. కానీ ఆయనకు ఏం పదవులు కావాలనే విషయంలో బేరాలు సెట్‌ కాలేదు. దానం ఏకంగా మేయర్‌ పీఠానికి టెండర్‌ పెట్టారని కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే తెరాస మాత్రం మేయర్‌ పీఠం కుదర్దు.. బుగ్గకారు ఉండేలా ఏదో ఒక నామినేటెడ్‌ పదవి మాత్రం ఇస్తాం అని ఆఫర్‌ చెప్పినట్లు వినిపించింది. దానితో పాటూ కేసీఆర్‌ సమక్షంలో చేరాలా? కేటీఆర్‌ సమక్షంలో చేరాలా? అనే విషయంలో కూడా తన స్థాయికి తగినట్లుగా తెరాస గౌరవించడం లేదనే అభిప్రాయం కలిగి దానం చేరడానికి ముందే అలిగి.. తెరాసలో చేరడాన్ని మానుకున్నట్లుగా పుకార్లు వచ్చాయి.

సీన్‌ కట్‌ చేస్తే-

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. కాంగ్రెస్‌లో ఉండిపోయినందువలన సాధించింది ఏమిటో.. దానంకు తెలిసిపోయింది. ఇలాగే ఉండడం వలన భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఆయనకు స్పష్టంగా కనిపించినట్లుంది. అందుకేనేమో వెంటనే తన పదవికి రాజీనామా చేసేశారు. కాకపోతే ఇప్పుడు ఆయనకు తెరాస వద్ద ‘బేరమాడే శక్తి’ సన్నగిల్లిపోయిందని అనుకోవాలి. నామినేటెడ్‌ పోస్టు అయినా ఇస్తారా? లేదా? అనేది అనుమానమే. కాకపోతే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు నగరంలో ఏదో ఒక చోట నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తే చాలు.. తతిమ్మా డిమాండ్లు ఏమీ లేకుండా.. నిశ్శబ్దంగా పార్టీలో చేరడానికైనా నాయకులు ఒప్పుకునే పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తొందర్లోనే డీఎస్‌ నిర్ణయించిన ముహూర్తానికి దానం చేరిక ఉంటుందని.. తెరాస అధినేతల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావాల్సి ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close