ఐదో రోజూ ఐటీ “మేఘా” సోదాలు..!

మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐదో రోజూ…సోదాలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇంత సుదీర్ఘంగా ఏ పారిశ్రామిక వేత్త ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేయలేదు. కానీ మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాపై మాత్రం కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి ప్రత్యేక ఐటీ అధికారుల బృందం రావడమే కాదు.. మూడు రోజుల పాటు ..స్థానిక ఐటీ అధికారులకు కూడా అవకాశం ఇవ్వలేదు. అయితే.. ఆ తర్వాత స్థానిక ఐటీ అధికారుల సహకారంతోనే సోదాలు కొనసాగిస్తున్నట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ బాలానగర్‌లో ఉన్న మేఘా ప్రధాన కార్యాలయం వద్ద.. కేంద్ర బలగాలు ఉన్నాయి. అదే సమయంలో.. కంపెనీ యాజమాన్యం.. ప్రైవేటు భద్రతను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంది.

సోదాలు జరుగుతున్న సమయంలో.. మేఘా కృష్ణారెడ్డిని కూడా పిలిపించినట్లుగా చెబుతున్నారు. రెండు, మూడు రోజుల నుండి… మేఘా కార్యాలయంలోనే ఉండి… ఐటీ అధికారులకు కావాల్సిన సమాచారాన్ని … అనుమానాలను.. మేఘా కృష్ణారెడ్డి తీరుస్తున్నారని చెబుతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఐటీ అధికారులు బయటకు వెళ్లి వస్తూండటంతో.. మేఘా వ్యాపార కుటుంబానికి చెందిన వారి లాకర్లు, ఇతర అంశాలను సరి చూసివస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

మేఘా కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులు ఉంటున్నప్పటికీ.. ఎవరికీ చిన్న సమాచారం అందకుండా మేఘా కృష్ణారెడ్డి అనుచరులు జాగ్రత్త పడుతున్నారు. మీడియాను వీలైనంత దూరం తరిమేందుకు ప్రత్నిస్తున్నారు. ఐదు రోజుల పాటు సోదాలు జరుగుతున్నాయంటే… కచ్చితంగా ఏదో ఓ బ్రేకింగ్ న్యూస్ ఉంటుందని మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close