#RRR… లేటెస్ట్ అప్ డేట్స్‌

రాజ‌మౌళి కుటుంబం మొత్తం లండ‌న్ వెళ్లింది. అక్క‌డ ‘బాహుబ‌లి’కి సంబంధించిన ఓ ఈవెంట్‌లో పాల్గొంది. దాంతో #RRR షూటింగ్‌కి విరామం వ‌చ్చేసింది. ఇప్పుడు మ‌ళ్లీ #RRR లైన్‌లోకి వ‌చ్చింది. రాజ‌మౌళి కుటుంబం హైద‌రాబాద్ తిరిగి రావ‌డంతో కొత్త షెడ్యూల్‌పై దృష్టి సారించారు. సోమ‌వారం నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ మొద‌లుకానుంది. ఈసారి ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రిపైనా స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది. #RRR టైటిల్‌పై ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని, మంచి రోజు చూసుకుని టైటిల్‌ని ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. కొమ‌రం భీమ్ జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ లుక్ బ‌య‌ట‌కు రానున్న‌ద‌ని బాగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ… రాజ‌మౌళి టీమ్ అలాంటి ప్ర‌య‌త్న‌మేదీ చేయ‌లేదు. దీపావ‌ళికి ఈ టీమ్ నుంచి ఎలాంటి లుక్కులూ రాక‌పోవొచ్చు. టైటిల్ కూడా చెప్పే అవ‌కాశాలు లేవు. #RRR నుంచి ఫ‌స్ట్ లుక్ రావాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close