కేసీఆరా..? జగనా..? ఆర్టీసీపై ఎవరు కరెక్ట్..?

ఆర్టీసీ విలీనం అసంభవం..!
ప్రపంచంలో ఎవరూ చేయలేరు..!
.. ఇది తెలంగాణ దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా ప్రకటించుకున్న సీఎం కేసీఆర్ తేలిన విషయం..!
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం..!
ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు..!
డిసెంబర్ నుంచి ప్రభుత్వం ద్వారానే జీతాల చెల్లింపు..!
… ఇది రూ. 16వేల కోట్ల లోటుబడ్జెట్‌తో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ.
సాధ్యం కాదన్న కేసీఆర్ కరెక్టా…? కార్యాచరణ ప్రారంభించిన జగన్ రైటా..? ..ఇది.. ఆర్టీసీ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామానలను పరిశీలిస్తున్న వారికి వస్తున్న డౌట్. నిజానికి ఇద్దరి దృక్కోణంలో ఎవరిది వారికి రైట్. కానీ ప్రజాప్రయోజనాల కోణంలో పరిశీలిస్తే… ఎవరిది కరెక్ట్..? ఎవరిది రైట్..? అన్నది అంచనా వేయడం కష్టమే.

ధనిక రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఎందుకు కేసీఆర్ విలీనం చేయడం లేదు..?

“తెలంగాణ వచ్చినంక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తాం. వారి కాలిలో ముల్లు గుచ్చుకుంటే నోటితో తీస్తా.. తెలంగాణలో ధర్నాలు, బంద్ లు చేసే పరిస్థితి రాదు… అలా చేయక ముందే డిమాండ్లు తెలుసుకుని పరిష్కరిస్తా”నని కేసీఆర్ ఉద్యమం సమయంలో.. ప్రకటనలు చేశారు. ఇవి కార్మికుల్ని ఉత్తేజితుల్ని చేశాయి. ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. అప్పట్లో దసరా సమయంలోనే.. సకలజనుల సమ్మె చేశారు. తెలంగాణ సాధించారు. సహజంగానే.. అప్పట్లో కేసీఆర్ అన్న మాటల ప్రకారం..ప్రయోజనాలు వస్తాయని ఆశించారు. అయితే కేసీఆర్ వారిని నిరాశపర్చలేదు. ఐదేళ్లలో రెండు సార్లు ఐఆర్ ప్రకటించారు. జీతాలు దాదాపుగా రెట్టింపయ్యాయి. వారు కోరుకుంటున్నది.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. కేసీఆర్ తెలంగాణ … అత్యంత ధనిక రాష్ట్రమని పదే పదే చెబుతూంటారు. అలాంటి ధనిక రాష్ట్రంలో… తెలంగాణ కోసం త్యాగాలు చేసిన తమకు చెప్పిన మాటను ఎందుకు అమలు చేయరనేది ఆర్టీసీ కార్మికుల వాదన. అయితే కేసీఆర్ గతంలో తెలంగాణ ధనిక రాష్ట్రమన్నారు కానీ.. ఇప్పుడు అనడం లేదు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందంటున్నారు. అందుకే వెనుకడుగు వేస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది.

పేద రాష్ట్ర సీఎం జగన్ ఆర్టీసీని విలీనం చేస్తున్నారు కదా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోటుతో పయనాన్ని ప్రారంభించింది. అదీ కూడా… సాదాసీదా మొత్తం కాదు. వేల కోట్లలోనే. అక్కడ హైదరాబాద్ లాంటి సిటీ లేదు. ఆదాయం కూడా తక్కువే. అలాంటి పరిస్థితుల్లోనూ.. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు. అక్కడ చేస్తున్నట్లుగా ఇక్కడ ఎందుకు చేయరనేదే.. కార్మికుల ప్రధానమైన ప్రశ్న. ఆర్టీసీ విలీనం అసాధ్యమన్నది నిపుణుల అభిప్రాయం. కానీ.. జగన్మోహన్ రెడ్డి .. ఎన్నికల హామీలను అమలు చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే చేయాలనుకున్నారు. నిజంగానే ఆర్టీసీ విలీనం అసంభవం. అందుకే కార్మికుల్ని మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు. ఆర్టీసీ.. ఆర్టీసీలానే ఉంటుంది. ఉద్యోగుల జీతభత్యాలు, వారి అవసరాలు మొత్తం ప్రభుత్వం చూస్తుంది.

ఆర్టీసీ విషయంలో ఎవరు కరెక్ట్..?

ఆర్టీసీ లాభాపేక్ష లేని సంస్థ. అది ప్రజారవాణాకు నిర్దేశించబడినది. దాన్నుంచి లాభాలు ఆశించలేరు. అలాగని.. నష్టాలు వందల కోట్లు వస్తే భరించడానికి ఏ ప్రభుత్వానికైనా కష్టమే. ఈ కోణంలోనే చూస్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్నది కరెక్టే. ఆర్టీసీని ఆర్టీసీ లాగే నడవనివ్వాలి. కానీ ఆయన సమస్యను డీల్ చేస్తున్న విధానంతోనే సమస్య వస్తోందన్నది నిపుణుల అభిప్రాయం. ఏపీ సీఎం జగన్.. తన ఎన్నికల హామీని నెరవేర్చాలనుకుంటున్నారు కాబట్టి చేసి తీరాలనుకుంటున్నారు. ప్రభుత్వంపై పడే భారాన్ని ఆయన అంచనా వేయడం లేదు. 50వేల మంది కార్మికులకు ప్రభుత్వం తరపున జీతాలు చెల్లించాలంటే.. నెలకు రూ.మూడు వందల కోట్ల వరకూ అవుతుంది. జీతాల భారం ప్రభుత్వం తీసుకుంటే… ఆర్టీసీకి గట్టెక్కుతుందా..? అంటే.. చెప్పడం కష్టమే. హామీని నెరవేర్చాలన్న పట్టుదల వరకూ.. జగన్ కరెక్ట్.

నిజానికి ఆర్టీసీ మనుగడ అసలు ఎప్పటికీ ప్రశ్నార్థకం అయ్యే చాన్సే లేదు. ప్రభుత్వం వివిధ వర్గాలకు ఇచ్చిన రాయితీలకు సంబంధించిన సొమ్ములు సమయానికి తిరిగిచ్చేసి… ఆర్టీసీ ఆస్తుల సమర్థ నిర్వహణ చేపట్టి… డీజిల్‌పై కాస్త పన్ను మినహాయింపు ఇస్తే సరిపోతుంది. సంస్థకు అంతకు మించి లాభాలు వస్తాయి.కార్మికులు ఎక్కువే లాభపడతారు. కానీ ప్రభుత్వాలు మాత్రం.. రాజకీయ కోణంలోనే సమస్యను చూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అంతే. అందుకే.. ఆర్టీసీ సమస్య రెండు.. రాష్ట్రాల్లోనూ.. రెండు రకాల పరిష్కారాలు వెదుక్కుంటోంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘వీర మాస్‌’… ఫిక్స‌యిన‌ట్టేనా?

రేపు జూన్ 10... అంటే బాల‌య్య పుట్టిన‌రోజు. హిందూపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా హ్యాట్రిక్ కొట్టిన త‌ర‌వాత వ‌చ్చిన పుట్టిన రోజుది. అందుకే అభిమానుల హ‌డావుడి మ‌రింత ఎక్కువైంది. 'కాబోయే మంత్రి బాల‌య్య‌' అనే...

పాపం అర‌వింద్… మంత్రిప‌ద‌వి ఆశ‌ల‌పై నీళ్లు!

ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్. వ‌రుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన అర‌వింద్... ఎన్నిక‌ల స‌మ‌యంలోనే త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌బోతుంద‌ని జోరుగా ప్ర‌చారం చేసుకున్నారు. ఈసారి త‌న‌ను గెలిపిస్తే మంత్రిగా తిరిగి వ‌స్తాన‌ని, కిష‌న్...

తెలుగు రాష్ట్రాల నుండి కేంద్ర‌మంత్రులు వీరే…

కేంద్ర‌మంత్రి వ‌ర్గం మ‌రికొద్దిసేప‌ట్లో కొలువు తీర‌నుంది. మోడీ 3.0లో ఎవ‌రెవ‌రుంటారు...? సంకీర్ణ ప్ర‌భుత్వంలో మోడీ ఎవ‌రిని కేంద్ర‌మంత్రులుగా తీసుకుంటారు...? కీల‌క పార్టీలుగా ఉన్న టీడీపీ, జేడీయూల‌కు ఎన్ని మంత్రిప‌ద‌వులు ద‌క్క‌బోతున్నాయి...?...

పురందేశ్వరి, సీఎం రమేష్ కాదు శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రి

ఏపీ నుంచి బీజేపీ తరపున గెలిచిన ముగ్గురిలో నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కబోతోంది. అసలు ఆయన పేరు ఉంటుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. దశాబ్దాలుగా బీజేపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close