మహారాష్ట్రలో బీజేపీ నుంచి ఊహించని రియాక్షన్..!

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానిస్తే.. సారీ అనేసింది.. భారతీయ జనతా పార్టీ. ఇప్పటి వరకూ.. భారతీయ జనతా పార్టీ నుంచి ఇలాంటి ఆన్సర్ ఎక్కడా రానే లేదు. ఇంకా.. మెజార్టీ లేకపోయినా.. కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో పోటీ పడి మరీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ.. మహారాష్ట్రలో మాత్రం.. సారీ అనేయడం.. ఆశ్చర్యకరమే. అసెంబ్లీ గడువు ముగిసే రోజున.. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి.. ఫడ్నవీస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలత తెలుపాల్సిందిగా కోరారు. నిజానికి ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని… గవర్నర్‌ను కోరలేదు. కానీ.. అతి పెద్ద పార్టీగా ఆయనే చాన్స్ తీసుకుని మరీ బీజేపీని ఆహ్వానించారు. కానీ… బీజేపీకి మెజార్టీకి కన్నా.. 41 సీట్లు తక్కువగా ఉన్నాయి. రిస్క్ ఎందుకులే అనుకుందేమో కానీ.. ఇప్పటికైతే నిరాసక్తత వ్యక్తం చేసింది.

ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ – శివసేన కలసి పోటీ చేశాయి. కానీ శివసేన రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి తమకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. ఇక్కడే రెండు పార్టీల మధ్య తెగడం లేదు. ఈ లోపు శివసేన ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న లక్ష్యంతో.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ఈరెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా.. కాంగ్రెస్ పార్టీ బయట నుండి మద్దతు ఇచ్చేలా ఓ ఫార్ములా కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కూడా.. ఈ ప్రయత్నాలను లైట్ తీసుకుంది. ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా… తమకు ఇబ్బందేం లేనట్లుగా భావిస్తోంది.

శివసేన – కాంగ్రెస్ – ఎన్సీపీ అనేది.. ఏ విధంగానూ కలవని కూటమి. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎక్కువ కాలం మనుగడ సాగించడం కష్టం. ఈ విషయం బీజేపీకి తెలుసు. మహారాష్ట్రలో శివసేన పార్టీని డంప్ చేయడానికి ఇంత కంటే మంచి మార్గం ఉండదని బీజేపీ పెద్దలు భావిస్తూ ఉండవచ్చని అంటున్నారు. జమిలీ ఎన్నికల నిర్వహణకు.. మోడీ, షా చురుగ్గా సన్నాహాలు చేస్తున్నారు. ఏ విధంగా చూసినా.. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మహారాష్ట్రలో ఎన్నికలు రావాలంటే.. ఇప్పటికి ప్రభుత్వాన్ని వదులుకుంటేనే మంచిదని బీజేపీ భావిస్తూ ఉండవచ్చని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close