రూ. 150 కోట్లు హవాలా మనీ అందుకున్న ఆ ఏపీ ముఖ్యుడు..?

” ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ముఖ్యుడు… రూ. 150 కోట్ల హవాలా మనీ అందుకున్నారు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ దొరికాయి…” ఇది కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ విడుదల చేసిన ఓ ప్రెస్‌నోట్‌లోని సారాంశం. ఐటీ దాడులు, ఈడీ వ్యవహారాలు మొత్తం సీబీడీటీ చేతుల్లోనే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టిన, చేపడుతున్న ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీపై.. ఐటీ అధికారులు దాడులు చేశారు. కనీసం వారం రోజుల పాటు విస్తృతంగా సోదాలు చేశారు. ఆ సోదాల్లో.. దేశవ్యాప్తంగా ఉన్న హవాల్ రాకెట్ గుట్టు రట్టయినట్లుగా ప్రకటించారు. ఆ కంపెనీ ఏదో బహిరంగంగా చెప్పలేదు. కానీ ఇలాంటి విషయాలను డీప్‌గా ఫాలో అయ్యే వారికి మాత్రం.. ఆ కంపెనీ  ఏదో కాస్త క్లారిటీ ఉంటుంది.

ఇప్పుడు.. రూ. 150 కోట్లు అందుకున్న ఆ ముఖ్యుడెవరన్నదానిపై… విస్తృతంగా చర్చ జరుగుతోంది. సీబీడీటీ తన ప్రకటనలో… ఆ ముఖ్యుడు వ్యాపార ప్రముఖుడా… రాజకీయ ప్రముఖుడా.. సినీ ప్రముఖుడా… అన్నదానిపై.. క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. ఇంత పెద్ద మొత్తంలో.. హవాలా డబ్బులు  తీసుకున్నాడంటే.. కచ్చితంగా ఆయనకు కచ్చితంగా రాజకీయాలతో సంబంధం ఉంటుందనేది.. ఎవరైనా సులువుగా ఊహించగలిగిన అంశం. ఎందుకంటే… ఏడు నెలల కిందట ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో… రాజకీయ పార్టీలకు డబ్బులు అవసరం. ఆ సమయంలో… జరిగిన లావాదేవీల్లోనే.. ఈ రూ.150 కోట్లు ఆ ప్రముఖుడు అందుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం చేసిన కట్టడి వల్ల.. ఓ పార్టీ డబ్బులు పంచలేకపోయిందని.. మరో పార్టీ విచ్చలవిడిగా పంపిణీ చేసిందన్న ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. హవాలా రాకెట్‌ ను చేధించామని… కొన్ని వందల లింక్‌లు బయటకు వచ్చాయని సీబీడీటీ చెబుతుంది. ఈ హవాలా మార్కెట్ అంతా.. సూట్ కేస్ కంపెనీల ద్వారా నడుస్తుంది. రిజిస్టర్లలో ఉండే కంపెనీలను.. కేవలం డబ్బు తరలింపు వాహకాలుగా ఉపయోగించుకుంటారు. ఇలాంటి కంపెనీల ద్వారా ఏపీకి హవాలా మనీ వచ్చిందని.. నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో పేరు పొందిన వారు.. ఏపీలో చాలా మంది ఉన్నారు. అందుకే.. ఈ అంశం ఏపీలో కలకలం రేపుతోంది.

ఎవరైనా కానీ… రూ. 150కోట్లు హవాలా ద్వారా తీసుకున్నాడంటే.. అతి కచ్చితంగా… అవినీతి సొమ్మే అయి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారైతే.. ప్రజాధనమే దోచుకుని ఉంటారు. కచ్చితంగా … ఈ విషయంలో సీబీడీటీ ప్రకటనలకే కాదు.. మొత్తంగా చర్యలు కూడా తీసుకోవాలి. అప్పుడే.. ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకం పెరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close