కిషన్ రెడ్డిని దువ్వుతున్న వైసీపీ..!

అధికారం అందిన ఉత్సాహంలో ఎవర్నీ లెక్క చేయకుండా… భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో.. సంబంధాలు చెడగొట్టుకున్న వైసీపీ నాయకత్వం ఇప్పుడు.. చేసిన తప్పును దిద్దుకునేందుకు.. మరో వైపు నుంచి ప్రయత్నాలు చేస్తోంది. అమిత్ షాకు డిప్యూటీగా ఉన్న కిషన్ రెడ్డిని దువ్వుతోంది. ఈ మేరకు విశాఖలో ఓ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి.. ఆయనను రప్పించారు. ఆయనపై ఓ రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించారు. బీజేపీ, కిషన్ రెడ్డితో స్నేహాన్ని కోరుకుంటున్నాం..! మాకు అండగా ఉండాలి..! ఆత్మీయ సమావేశంలో ..వైసీపీ నేతలు మొహమాటం లేకుండా కిషన్ రెడ్డిని అడిగేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ విషయంలో ఏ మాత్రం.. మొహమాటలకు పోలేదు. కిషన్ రెడ్డి అంటే… ” ఓ అది.. ఓ ఇది..” అంటూ.. పొగడ్తల వర్షం కురిపించేశారు. ఆయనే కాదు.. మరో నేత ద్రోణం రాజు శ్రీనివాస్ కూడా తగ్గలేదు. కిషన్‌రెడ్డి క్రమశిక్షణ కలిగిన రాజకీయ నేతల్లో అరుదైన వ్యక్తి అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం దోహదపడాలని కోరారు.

కిషన్ రెడ్డికి ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసే అంశంలోనే.. వైసీపీ నేతలు ఓ ప్రత్యేకమైన వ్యూహంతో వ్యవహరించారని.. దిట్టంగా అతిథి మర్యాదలు చేసి..  పరిచయాలు వీలైనంతగా పెంచుకునేందుకు ప్రయత్నించారని…  సన్మాన కార్యక్రమంలోనే గుసగుసలు వినిపించాయి. కిషన్ రెడ్డి మామూలుగా అయితే బుధవారం.. ఆర్కే బీచ్‌లో స్వచ్చభారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఆయన ఒక రోజు ముందే వచ్చేలా.. సోము వీర్రాజు ద్వారా .. వైసీపీ నేతలు లాబీయింగ్ చేసుకున్నారు. సోము వీర్రాజు ప్రయత్నాలు ఫలించడంతో.. వైసీపీ నేతల ఆత్మీయ సమావేశానికి.. కిషన్ వచ్చారు. అదే సందుగా.. ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. సోము వీర్రాజు.. ఇటీవలి కాలంలో వైసీపీతోనే అత్యంత సన్నిహింతగా ఉంటున్నారు. తన పాత పరిచయాలతో… ఇలాంటి సాయాలు చేస్తున్నారన్న అభిప్రాయం బీజేపీలో వ్యక్తమవుతోంది.

కిషన్ రెడ్డి అమిత్ షాకు డిప్యూటీగా ఉన్నారు. అమిత్ షాతో భేటీ కోసం.. జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల పాటు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అమిత్ షా పుట్టినరోజు నాడు.. ఆయనను కలిశారు. కానీ… శుభాకాంక్షలు చెప్పడానికే పరిమితమయ్యారు. వినతి పత్రం ఇచ్చినా.. తాను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పలేకపోయారు. ఈ కారణంగా.. కిషన్ రెడ్డి ద్వారా.. తమ పనులు చేయించుకోవాలన్నది వైసీపీ నేతల వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే.. కిషన్ , బీజేపీతో స్నేహాన్ని కోరుకుంటున్నామని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close