ఎలా మాట్లాడాలో జగన్‌కు నేర్పాలని బొత్సకు పవన్ కౌంటర్..!

పవన్ నాయుడూ అంటూ.. తనపై ఒంటికాలితో లేస్తున్న వైసీపీ నాయకులకు.. జనసేన అధినేత సింపుల్ గా కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అని పిలిచినందుకే.. తనకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని.. 151 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి…ఏ పేరుతో పిలవాలో.. తనకు పంపితే.. అదే పేరుతో పిలుస్తానని.. ప్రకటించారు. సమష్టిగా నిర్ణయం తీసుకొని ప్రజలకు చెబితే.. అదే పేరుతో పిలుస్తారన్నారు. ముఖ్యమంత్రి పేరు జగన్ రెడ్డి కాబట్టి.. జగన్ రెడ్డి అని పిలిచానని అందులో తప్పేముందున్నారు. జాతీయ మీడియా కూడా జగన్ రెడ్డి అనే సంబోధిస్తుందని గుర్తు చేశారు. పవన్‌ నాయుడు అని వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. బొత్సను బొత్స నాయుడు అంటే.. బాగుంటుందా అని ప్రశ్నించారు.

అంతే కాదు.. మతం మార్చుకున్నా కూడా.. జగన్ కులం పేరు తగిలించుకుంటున్నారని… విమర్శించారు. జగన్‌ క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తారు.. దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జగన్ ఆయన తిరుపతి ప్రసాదం తింటారో లేదో తెలియదని వ్యాఖ్యానించారు. బొత్స తనపై చేసిన విమర్శలను పవన్ కల్యాణ్ లైట్ తీసుకున్నారు. తను నన్ను తిడితే బొత్సకు 2 నెలలు మంత్రి పదవి పెరుగుతుంది తప్ప.. మరే ప్రయోజనం ఉండదన్నారు. తన పెళ్లిళ్ల గురించి, భార్యల గురించి మాట్లాడుతున్న జగన్‌కు… బొత్స ముందుగా మాట్లాడటం నేర్పాలని.. పవన్ సూచించారు. విడిపోయి ఎవరికి వాళ్లుగా బతుకుతున్నామని.. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలన్నారు. మంత్రి బొత్స తమ నాయకుడికి చెప్పాలని సూచించారు. తామంతా ఒకే జాతి అన్న భావన తెలంగాణలో ఉందని.. కానీ.. ఏపీ లో మాత్రం అందరూ కులాల వారీగా విడిపోయారన్నారు. సమస్యలని పక్కదారి పట్టించడానికి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని విమర్శించారు.

పవన్ కల్యాణ్ జగన్ రెడ్డి అని సంబోధించడంతో.. వైసీపీ మంత్రి పేర్ని నాని అత్యుత్యాహానికి పోయి.. పవన్ నాయుడు అంటూ సంబోధించారు. అది మిస్ ఫైర్ అయిన సూచనలు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని షార్ట్ కట్‌లో చాలా మంది జగన్ .. జగన్ రెడ్డి అని సంబోధిస్తూ ఉంటారు. దానికే అంతగా ఓవర్ రియాక్ట్ కావాల్సిన అవసరం ఏముందని.. అది కూడా..పవన్ కల్యాణ్‌కు కులం అంటగట్టి.. ఆయనను కించ పరిచే ప్రయత్నం చేయడం ఎందుకన్న చర్చ.. వైసీపీలోనే నడుస్తోంది. పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా.. దీన్ని ఉపయోగించుకుంటూ.. వైసీపీ ఎలా కుల వివక్ష చూపిస్తుదో.. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close