అనర్హతా వేటు నుంచి వంశీ తప్పించుకున్నట్లే..!?

వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నిర్ణియంచారు. తెలుగుదేశం పార్టీపై… ఆ పార్టీ అధినేతపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడమే కాదు.. వైసీపీకి బహిరంగంగా మద్దతు పలికారు. వైసీపీలో చేరుతానని..జగన్ తో కలిసి నడుస్తానని ప్రకటించారు. ఈ విషయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. వంశీ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని.. ఉపేక్షించకూడదని నిర్ణయానికి వచ్చారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానించారు. కొద్ది రోజుల క్రితమే.. వంశీ టీడీపీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా టీడీపీ అధినేతకు.. ఓ లేఖను..వాట్సాప్‌లో పంపారు. అయితే.. ఫిజికల్‌గా మరే లేఖలు పంపలేదు. నోటి మాట ద్వారా రాజీనామా చేసినట్లుగా చెప్పి.. పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు కానీ… అలా చేరితే.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద.. అనర్హతా వేటు పడుతుంది. ఆ కారణంగా…టీడీపీ చర్య తీసుకుంటుందేమో అని కొన్నాళ్లు వేచి చూశారు. అయితే.. టీడీపీ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేవు.. ఎమ్మెల్యేగా కొనసాగాలంటే.. అనర్హతా వేటు పడకూడదు.. అందుకే.. వంశీ.. . టీడీపీ అధినేతను తీవ్రంగా విమర్శించే వ్యూహాన్ని ఎన్నుకున్నారంటున్నారు. చంద్రబాబును అన్ని మాటలు అన్న తర్వాత కూడా.. ఎలాంటి చర్య తీసుకోకుండా ఉండే అవకాశం ఉండదు. అనుకున్నట్లుగానే సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు.. వంశీ నేరుగా వైసీపీలో చేరడానికి అవకాశం ఉంది. అనర్హతా వేటు పడకుండా… తప్పించుకోవడానికి ఓ అవకాశాన్ని టీడీపీనే కల్పించినట్లయింది. ఇప్పుడు .. స్పీకర్ తమ్మినేని సీతారాం.. వంశీ వెళ్లి వైసీపీలో చేరినా.. అనర్హతా వేటు వెంటనే వేయకపోవచ్చు.

కానీ.. వైసీపీ అధినేత జగన్ ప్రవచించిన విలువలు మాత్రం.. వెనక్కి పోతాయి. ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకుంటే.. రాజీనామా చేసిన తర్వాత మాత్రమే.. పార్టీలో చేర్చుకుంటానని ఆయన చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు వంశీని రాజీనామా చేయించకుండా చేర్చుకుంటే ఆ మాట తప్పినట్లు అవుతుంది. అందుకే.. టీడీపీ సస్పెండ్ చేసినా.. కొన్నాళ్లు తటస్థ సభ్యుడిగా కొనసాగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close