ఫడ్నవీస్ స్కోరు 80 గంటల్లో రూ. 40వేల కోట్లట..!

మహారాష్ట్రంలో సీఎంగా ఫడ్నవీస్ ఉన్న 80 గంటల్లో.. రూ. 40వేల కోట్లను… ఆ రాష్ట్రానికి కాకుండా వెనక్కి పంపేశారా..? అవుననే అంటున్నారు..బీజేపీకే చెందిన ఎంపీ అనంతకుమార్ హెగ్డే. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే మెజార్టీ తమకు లేదని తెలిసినా… పడ్నవీస్‌ సీఎం అయ్యారని దానికో డ్రామా ఉందని ఆయన బహిరంగంగా చెప్పుకొచ్చారు. శివసేన – ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి నేరుగా అధికారానికి వస్తే అభివృద్దికి కేటాయించిన రూ. 40వేల కోట్లు నిధులు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని బీజేపీ భావించిందట.

అందుకే మెజార్టీ లేకపోయినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. విశ్వాస పరీక్షలో నెగ్గే అవకాశం లేదని తెలిసి కూడా సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టారని హెగ్డే అంటున్నారు. అనుకున్నట్లుగా.. ఫడ్నవీస్ రూ. 40వేల కోట్లను కేంద్రానికి పంపేశారట. అనంత్ కుమార్ హెగ్డే ప్రకటనతో బీజేపీలో ఒక్క సారిగా ప్రకంపనలు వచ్చాయి. ఫడ్నవీస్ స్వయంగా వివరణ ఇచ్చుకోక తప్పలేదు. పదవిలో ఉన్న 80 గంటల్లో తాను ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. తమ పార్టీ ఎంపీ చేసిన వాటిని తప్పుడు ఆరోపణలుగా కొట్టిపారేశారు.

అంతే కాదు… ఎలాంటి అనుమానాలున్నా హెగ్డే వ్యాఖ్యలపై విచారణ చేసుకోవచ్చని ధాకరేకు ఫడ్నవీస్ సలహా కూడా ఇచ్చారు. ఒక్క పైసా కూడా కేంద్రానికి వెనక్కి ఇవ్వలేదని ఫడ్నవీస్ నెత్తి నోరు బాదుకుని చెబుతున్నారు. ఇలాంటి అవకాశం వస్తే.. సేన- ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి ఎందుకు ఊరుకుంటుంది. బీజేపీ మహారాష్ట్రకు వ్యతిరేకమనే ప్రచారం ప్రారంభించింది. ఇప్పుడు దీన్ని ఎలా అడ్డుకోవాలో తెలియక బీజేపీ తంటాలు పడే పరిస్థితికి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close