“దిశ” నిందితుల ఎన్‌కౌంటర్..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన “దిశ” అత్యాచారం, హత్య ఘటనలో ఉన్న నలుగురు నిందితుల్ని.. పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే.. కాల్చేశారో.. అక్కడే… ఎన్‌కౌంటర్ చేశారు. షాద్‌నగర్ దగ్గర చటాన్ పల్లిలో ఉన్న ఓ బ్రిడ్జి కింద.. దిశను.. నిందితులు…సజీవంగా దహనం చేశారు. ఆ ప్రాంతానికి దగ్గర్లోనే.. ఈ తెల్లవారుజామున కాల్పుల మోత మోగింది. నలుగురు నిందితుల శరీరాల్లోకి బుల్లెట్లు దిగిపోయాయి. అందరూ క్షణాల్లో విగతజీవులుగా మారిపోయారు. అందరికీ… రోజుల వ్యవధిలోనే… క్యాపిటల్ పనిష్మెంట్ … విధించినట్లయింది.

నిందితులైన అరిఫ్ పాషా, శివ, చెన్నకేశవులు, నవీన్ లను పోలీసులు ఈ తెల్లవారు జామును .. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం.. చటాన్ పల్లి తీసుకెళ్లారు. మొదటగా.. ఎక్కడ ఆమె బైక్ పెట్టింది.. వీరు లారీ ఎక్కడ పెట్టారు.. అనే అంశాలను.. పరిశీలించారు. ఆ తర్వాత.. దిశను తగులబెట్టిన.. చటాన్ పల్లి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు తమ తుపాకులకు పని చేశారు. నలుగుర్నీ కాల్చేశారు. దాంతో వారి విషయంలో దేశం మొత్తం అడుగుతున్న శిక్ష… వేసినట్లయింది.

లారీ డ్రైవర్లుగా పని చేస్తున్న అరిఫ్ పాషా. శివ, చెన్నకేశవులు, నవీన్ గత నెల ఇరవై ఎనిమిదో తేదీన… ఒంటరిగా ఉన్న దిశపై అత్యాచారం చేసి.. హత్య చేశారు. పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా.. కలకలం రేపింది. నిందితులను తక్షణం శిక్షించాలన్న డిమాండ్ ఊపందుకుంది. వారిని జైల్లో పెట్టి మేపితే.. నేరాలు తగ్గవని పెరుగుతాయని.. తక్షణం … వారిని ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్లు వినిపించాయి. పోలీసులు ఈ డిమాండ్లను అంగీకరించినట్లుగా తెలుస్తోంది. కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చిన తర్వాత గంటల్లోనే.. ఈ ఘటన చోటు చేసుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close