ఆరు జీవోల రద్దు..! జగన్ భయపడ్డారా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… హఠాత్తుగా ఆరు జీవోలను రద్దు చేసింది. ఇవన్నీ.. వేర్వేరు అంశాలకు సంబంధించినవయితే.. కామనేగా అనుకోవచ్చు. కానీ అన్నీ ఒక్క అంశానికి సంబంధించినవే. అవీ కూడా ముఖ్యమంత్రికి సంబంధించినవి. ఆయన ఇంటి కోసం.. రూ. కోట్లకు కోట్లు మంజూరు చేస్తూ.. ఇచ్చిన జీవోలు. వాటిపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ప్రజాధనం ఏంటీ.. ఇంత సులువుగా.. సొంతానికి వాడేసుకుంటున్నారన్న విమర్శలూ గట్టిగానే వచ్చాయి. వాటన్నింటినీ అప్పుడు ఏ మాత్రం పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి… తాజాగా.. ఆ జీవోలన్నింటినీ రద్దు చేయమని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలను జగన్ పాటించారు.

ఇంటి కిటికీలకు రూ. 73 లక్షలు మంజూరు చేసిన జీవో 259, ఫర్నీచర్ కొనుగోలు కోసం ఇచ్చిన జీవో 308, ఇళ్ల మెయిన్‌టనెన్స్‌ కోసం ఇచ్చిన జీవో 307, ఏసీలు ఇతర సదుపాయాల కల్పన కోసం ఇచ్చిన జీవో 254, లోటస్ పాండ్ సౌకర్యల కోసం ఇచ్చిన జీవో 160, కరెంట్ మెయిన్‌టనెన్స్ కోసం ఇచ్చిన జీవో 327లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి నిధులు ఏమైనా విడుదల చేసి ఉంటే.. వెనక్కి తీసుకుంటారు. విడుదల చేయకపోతే ఆపేస్తారు. ముఖ్యమంత్రికి తెలియకుండా.. ఆయన ఇంటికి నిధులను అధికారులు మంజూరు చేయరు. ఆన్నీ ఆయనకు తెలిసే ఉంటాయి. తెలిసి జరిగినా.. ఎందుకు రద్దు చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది.

ప్రజాధనం ఖర్చు పెట్టేది ఏదైనా ప్రభుత్వానికి చెందుతుంది. ఇప్పటి వరకూ ప్రైవేటు గృహాలకు… ప్రభుత్వ సొమ్మును వెచ్చించిన దాఖలాలు లేవు. అలా వెచ్చిస్తే.. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కిటీల కోసం వెచ్చించిన సొమ్ము.. ఇతర సౌకర్యాల కోసం వెచ్చినంచిన సొమ్ము.. ప్రభుత్వం మారిన తర్వాత.. రికవరీ చేసే అవకాశం ఉంది. దీన్ని వివాదాస్పదం చేయడం కూడా.. ఈ ప్రభుత్వమే నేర్పింది. కోడెల ఫర్నీచర్ కేసు దీనికి ఉదాహరణ. ప్రభుత్వం మారిన తర్వాత ఇలాంటి పరిస్థితులు వస్తాయన్న భయంతోనే…. జగన్మోహన్ రెడ్డి.. తన ఇంటికి ప్రజాధనంతో కల్పించుకున్న సౌకర్యాలన్నింటినీ వెనక్కి ఇచ్చేస్తున్నారని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close