అలీకి మాతృ వియోగం

ప్ర‌ముఖ హాస్య న‌టుడు అలీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న త‌ల్లి .జైతున్‌బేబీ గురువారం తెల్ల‌వారుఝామున తుది శ్వాస విడిచారు. ఆమె గ‌త కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. రాజ‌మండ్రి నుంచి మృత‌దేహాన్ని హైద‌రాబాద్ తీసుకొస్తున్నారు. అయితే అలీ ప్ర‌స్తుతం న‌గ‌రంలో లేరు. ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం రాంచీలో ఉన్నారు. అక్క‌డి నుంచి ఆయ‌న కూడా బ‌య‌ల దేరారు. జైతున్ అంత్య‌క్రియ‌లు ఈరోజు మ‌ణికొండ‌లో జ‌రుగుతాయ‌ని తెలుస్తోంది. అమ్మంటే అలీకి చాలా ఇష్టం. త‌న కుటుంబాన్ని అలీ చూసుకునే విధానం గురించి ప‌రిశ్ర‌మ‌లో క‌థ‌లు క‌థ‌లుగా చెబుతుంటారు. అమ్మ‌ని చాలాసార్లు మ‌క్కా కూడా తీసుకెళ్లారు అలీ. ఆమె మ‌ర‌ణం అలీకి తీర‌ని లోటే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close