జగన్‌ ప్రకటనపై మంత్రి కొత్త అర్థం..! యూటర్నా..? రిటర్నా..?

రాజధానిపై జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం హాట్ టాపిక్ అయితే.. మంత్రి పేర్ని నాని.. తీరిగ్గా.. ఉదయం మీడియా సమాశం పెట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు.. లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఓ ముఖ్యమంత్రి మాటలను… తెల్లవారే.. మరో మంత్రి అంత తేలిగ్గా తీసిపారేయడం.. సాధారణంగా జరిగే విషయం కాదు. వ్యూహాత్మకంగా.. మంత్రితో … ప్రభుత్వ పెద్దలే అలా చెప్పించారని అనుకోవాలి. పెరుగుతున్న ఆందోళనలను చల్లబరిచేందుకు ఇలాంటి ప్రకటన చేయించారన్న అభిప్రాయం సహజంగానే వ్యక్తమవుతోంది.

జగన్ రాజధాని కోసం కమిటీల్ని నియమించారు. ఇప్పటికే కేంద్రం గుర్తించిన రాజధాని ఉంది కాబట్టి… నేరుగా రాజధాని కోసం కమిటీ వేయడం… చట్టవ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది.. అందుకే.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం అనే కమిటీ వేశారు. ఈ కమిటీని వేసిన ఉద్దేశం కూడా… జగన్ చెప్పిన అంశాలను.. నివేదిక రూపంలో ఇవ్వడానికేనని ప్రత్యేకంగా విడమర్చి చెప్పాల్సిన పని లేదు. కమిటీ వేసినప్పుడే… ప్రభుత్వ ఉద్దేశాలేమిటో… ప్రత్యేకంగా సమావేశం పెట్టి వివరించి ఉంటారు. ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక కావాలో చెప్పేందుకు… జగన్ సీఎం కాగానే నియమించిన పలు నిపుణుల కమిటీల చైర్మన్ రేమండ్ పీటర్ కూడా… రాజధానిపై నియమించిన కమిటీలో ఉన్నారు. ఎలా చూసినా.. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే.. కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. అందులో.. ఇసుమంత కూడా.. తేడా రాదనేది జనంలో బలంగా ఉన్న నమ్మకం.

కమిటీలను నియమించి… ఆ కమిటీల్లో ఉన్న నిపుణులను కించపరిచేలా… సొంత అభిప్రాయాలను జగన్ వెల్లడించడంతో.. వస్తున్న విమర్శలకు.. కౌంటర్ ఇవ్వడానికి మంత్రి పేర్ని నాని ప్రెస్‌మీట్‌లో తంటాలు పడ్డారనేది.. చాలా మంది నమ్ముతున్న విషయం. జరుగుతున్న ఆందోళనలను.. చర్చను.. చల్లబరిస్తే… తర్వాత కమిటీ నివేదిక వచ్చే సరికి.. ప్రజలు మానసికంగా సిద్దమైపోతారని.. ప్లాన్ అధికార పక్షానికి ఉండొచ్చు. అప్పుడు అదే పద్దతిలో.. కమిటీ నివేదికను బయటపెట్టి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అందుకే.. ఇప్పుడు జగన్…మూడు రాజధానులు ఉంటాయని.. జగన్ కచ్చితంగా చెప్పలేదనే వాదనను తెరపైకి తెచ్చి.. విషయ తీవ్రతను కాస్త తగ్గించే వ్యూహం… ప్రభుత్వం అమలు చేస్తోందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రివర్గ సమావేశంపై సస్పెన్స్..!!

నేడు జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంపై సస్పెన్స్ నెలకొంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ కేబినెట్ సమావేశానికి ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎలాంటి రిప్లై లేకపోవడంతో...

రామోజీ ఫిల్మ్‌సిటీని మ‌లేషియాగా మార్చేశారు!

'పుష్ష 2' షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం కంక‌ణం క‌ట్టుకొంది. అందుకు త‌గ్గ‌ట్టే రాత్ర‌న‌క, ప‌గ‌ల‌న‌క ప‌ని చేస్తోంది. ఈ సినిమా...

ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ నోరు పెగలదేంటి..?

టీడీపీ నేతలకు తనదైన శైలిలో విరుచుకుపడే ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ ఇప్పటికీ బయటకు రాకపోవడంపై రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన ఎవరో కాదు.. కొడాలి నాని. పోలింగ్ ముగిసిన నాటి...

పరారీ లేకపోతే జైలు – జగన్‌ను నమ్ముకుంటే అంతే !

వైసీపీ అధినేత జగన్ ప్రశాంతంగా లండన్ పోయారు. కానీ ఆయన చెప్పినట్లుగా చేసిన..చేస్తున్న వారు అయితే పరారీలో ఉన్నారు లేకపోతే ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడాల్సి వస్తోంది. జగన్ పార్టీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close