పాక్ రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు, అణుబాంబులు తీస్తామని భారత్‌కు వార్నింగ్

హైదరాబాద్: పాకిస్తాన్ రక్షణశాఖమంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమవద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం ప్రదర్శనకోసం కాదని, అవసరమైతే వాటిని ఉపయోగిస్తామని హెచ్చరించారు. జియో అనే పాకిస్తాన్ టీవీ ఛానల్‌లో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలు ఉపయోగించే సందర్భం రాకూడదని కోరుకుంటున్నామని, అయితే మనుగడకు సవాళ్ళు ఎదురైతే వాడటానికి వెనకాడబోమని అన్నారు. పాకిస్తాన్‌లో తీవ్రవాదాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహిస్తూ భారత్ ప్రఛ్ఛన్నయుద్ధం చేస్తోందని ఆరోపించారు. పాక్ రక్షణ సామర్థ్యం మహత్తరంగా ఉందని చెప్పారు. ఆసిఫ్ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని రక్షణరంగ నిపుణులు అంటున్నారు. కొంతకాలంక్రితం మూషారఫ్‌కూడా ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారని రక్షణరంగ నిపుణుడు రాజ్ కడ్యన్ అన్నారు. పాకిస్తాన్ మూర్ఖంగా అలాంటి చర్యలకు దిగితే ఆ దేశం ప్రపంచపటంనుంచి కనుమరుగవుతుందని చెప్పారు. మరోవైపు రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడి రష్యాలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ కాబోతున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో హాజరవటానికి వీరిరువురూ రష్యా వెళ్ళారు. ఇరుదేశాలమధ్య శాంతి చర్చలు పునఃప్రారంభానికి ఈ భేటీ ఉపయోగపడొచ్చని మరో రక్షణరంగ నిపుణుడు ఉదయభాస్కర్ వ్యాఖ్యానించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close