మంత్రులంతా బిజీబిజీ… ఆ ముద్ర చెరిపేందుకేనా?

అంద‌రూ ఒక్క‌సారిగా బిజీ అయిపోయారు! ఒక‌రేమో పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌తో మాట్లాడుతుంటే, మ‌రొక‌రేమో ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్నారు! ఒక‌రేమో ఆసుప‌త్రుల్లో సౌక‌ర్యాల‌పై దృష్టిపెట్టి ప‌ర్య‌టిస్తుంటే, మ‌రొక‌రేమో దేవాల‌యాల్లో స‌దుపాయాల‌ను మెరుగు చేసే ప‌నుల్లోప‌డ్డారు. తెలంగాణ మంత్రులంతా ఇప్పుడు బిజీబిజీగా జిల్లాల్లో గ‌డుపుతున్నారు. మ‌రీ ముఖ్యంగా… గ‌త‌వారం రోజులుగా చూసుకుంటే వారి హ‌డావుడి మ‌రింతగా క‌నిపిస్తోంది.

మెద‌క్ జిల్లాలో ప‌ర్య‌టించి మంత్రి హ‌రీష్ రావు… తూఫ్రాన్ మండలంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… విద్యార్థుల కోసం ప్ర‌భుత్వం చెయ్యాల్సినంతా చేస్తోంద‌నీ, వీరంతా భ‌విష్య‌త్తులో ప్ర‌పంచంతో పోటీప‌డేలా తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు. మంత్రి ఈటెల రాజేంద‌ర్… హైద‌రాబాద్ నేచ‌ర్ క్యూర్ లో ఓపీ సేవ‌లు ప్రారంభిస్తామ‌న్నారు. సంప్ర‌దాయ వైద్యానికి పున‌ర్వైభ‌వం తీసుకొస్తామ‌న్నారు. ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్… ఖ‌మ్మం నుంచి కొత్త‌గూడెం వ‌ర‌కూ ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించారు. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ముగింపు స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు క‌దా… మంత్రులూ ఎమ్మెల్యేలూ నెల‌కి ఒక‌సారైనా ఆర్టీసీలో ప్ర‌యాణించాల‌ని! దాన్ని తు.చ‌. తప్ప‌కుండా అమ‌లు చేస్తున్నారు. ఆర్టీసీలో స‌రుకుల ర‌వాణా త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌నీ, లాభాల బాట‌లో సంస్థ‌ను న‌డిపించాల‌న్న స‌దుద్దేశంతో ఉన్నామ‌న్నారు. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు… ఖ‌మ్మం, మెహ‌బుబాబాద్ జిల్లాల్లో ప‌ర్య‌టించారు. మెహ‌బుబాబాద్ జిల్లా ఆసుప‌త్రిని ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి, సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. ప‌రిశుభ్ర‌త బాగులేద‌ని ఆగ్ర‌హించి, కాంట్రాక్ట‌రును అప్ప‌టిక‌ప్పుడే తొల‌గిస్తున్న‌ట్టు ఆదేశించారు. హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో మంత్రి స‌బితారెడ్డి, మంత్రి మ‌ల్లారెడ్డి ప‌ర్య‌టించి మ‌రికొన్ని కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఉన్న‌ట్టుండి మంత్రులంతా ఇలా ఒకేసారి జిల్లాల బాట ప‌ట్టేసి, ప్ర‌జ‌ల్లోకి దూకుడుగా వెళ్తున్నారేంటి..? రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. కేసీఆర్ స‌ర్కారు రెండో ద‌ఫాకి ఏడాది పూర్త‌యింది. ఏడాది గ‌డుస్తున్నా చేసిందేం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. ఈ ఏడాదిలో ఏం సాధించారో చెప్పుకునేందుకు మంత్రుల ద‌గ్గ‌రా ప్ర‌త్యేకంగా కంటెంట్ ఏం లేదు! అలాంటి చ‌ర్చ ప్ర‌జ‌ల్లో రాకుండా ఉండాలంటే, ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున విమ‌ర్శించ‌కుండా ఉండాలంటే… నేత‌లు జ‌నంలో ఉండాలి, ఉంటున్నారు. ఇక‌, రెండో కార‌ణం… త్వ‌ర‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు రాబోతున్నాయి. చేసిన‌వి చెప్పుకోవాలి, లేదా చేయ‌బోయేవి చెప్పాలి. ఇప్పుడు మంత్రులంతా జిల్లాల పేరుతో చేస్తున్న‌ది ఇదే ప్ర‌య‌త్నం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close