ప్రభుత్వం అడిగిందే రాసిచ్చాం..! బీసీజీ డిస్‌క్లెయిమర్..!

ఈ కింది ఇచ్చిన సమాచారంతో మాకు సంబందం లేదు.. అంటూ.. డిస్‌క్లెయిమర్ ప్రకటించేసుకుంది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. మూడు రాజధానులపై నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తప్పించుకుంది. తాము ఇచ్చిన నివేదికతో తమకేమీ సంబంధం లేదని… ప్రభుత్వం అడిగిందే రాసిచ్చామని… స్పష్టంగా చెప్పింది. రాజధాని వికేంద్రీకరణ ఎలా అని ఏపీ ప్రభుత్వం మా సలహా కోరిందని.. దానికి అనుగుణంగా పరిశోధించి… క్షేత్రస్థాయి పరిశీలన చేసి… గణాంకాలు లెక్కదీసి రిపోర్ట్‌ ఇస్తున్నామని 6వ పేరాలో స్పష్టంగా చెప్పింది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. రాజధాని వికేంద్రీకరించాలని… ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతే బోస్టన్‌ కన్సల్టెన్సీకి అప్పగించారని.. బీసీజీ నేరుగా చెప్పినట్లయింది.

వికేంద్రీకరణ చేయడం ఎలా .. అనే విషయం మాత్రమే చెబుతున్నామని.. వికేంద్రీకరించాలన్న నిర్ణయం ప్రభుత్వానిదేనని బీసీజీ తేల్చేసింది. అంటే.. ప్రభుత్వం ఏం కావాలో.. ఎలాంటి రిపోర్ట్ కావాలో.. ముందుగానే చెప్పింది. దానికి తగ్గట్లుగానే.. బీసీజీ రిపోర్ట్ రెడీ చేసి ఇచ్చింది. ఈ రిపోర్ట్ వల్ల భవిష్యత్‌లో తమకు ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా.. కనీసం బాధ్యత కూడా ఉండదని చెప్పుకునేందుకు బీసీజీ ప్రణాళిక ప్రకారం వ్యవహరించింది. మొదటి నుంచి విపక్ష పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణలు ఇవే. బీసీజీ.. ప్రభుత్వానికి కావాల్సినట్లు నివేదిక ఇస్తుందని చెబుతున్నారు.

అలాగే రిపోర్టు ఇచ్చింది. జగన్ విశాఖకు రాజధానిని తీసుకెళ్లాలనుకుంటున్నారు.. దానికి తగ్గట్లుగానేనివేదిక వచ్చింది. నిజానికి బీసీజీని రిపోర్ట్ అడుగుతూ.. ప్రభుత్వం ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు. ఎలాంటి చట్టబద్ధత కూడా లేదు. అయినప్పటికీ.. ఆ కమిటీ రిపోర్ట్ కు.. చాలా వాల్యూ ఉందన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఈ కమిటీ రిపోర్టునే చూపించి.. మిగిలిన చర్యలు తీసుకుంటే.. మొదటికే మోసం వస్తుందని అనుకున్నారో.. చిన్న కేసు పడినా.. అంతర్జాతీయంగా.. తమ కంపెనీకి చెడ్డ పేరు వస్తుందని భావించారేమో కానీ.. బీసీజీ.. డిస్‌క్లెయిమర్ ప్రకటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close